తాజా వార్తలు

సినిమా వార్తలు

ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెలంగాణ వార్తలు

ఆంధ్రప్రదేశ్ వార్తలు

తెలంగాణ వార్తలు

Advertise Space

జాతీయ వార్తలు

అంతర్జాతీయ వార్తలు

సినిమా వార్తలు

తాజా వార్తలు

Thursday, 8 November 2018


అమిత దూకుడు ఉన్న బాలీవుడ్ హీరోయిన్లలో అలియా భట్ ఒకరు. ఈమె త్వరలోనే రణ్‌బీర్ కపూర్‌ను పెళ్లి చేసుకోనుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ, ఈ వార్తలపై ఆమె ఇప్పటివరకు పెదవి విప్పలేదు. అయితే, తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మాత్రం తనకు సరైనోడు దొరికాడంటూ వ్యాఖ్యానించారు.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, ‘అవును నాకు “సరైనోడు” దొరికాడు. నాపట్ల అభిమానం, ప్రేమ ఉన్నవాడు.. మరీ ముఖ్యంగా అందమైన వ్యక్తి. నటీనటుల జీవితాలు చాలా వర్ణాతీతంగా ఉంటాయి. ఏదైనా ఒక సినిమాలో నటించిన తర్వాత మేమెప్పుడూ నిక్కచ్చి తీర్పునే కోరుకుంటాం. ఆ తీర్పు ప్రభావం నా మీద కూడా ఉంటుంది. దర్శకులు చెప్పినట్లే కెమెరాల ముందు సినిమాల్లో నటిస్తాను కానీ ఎన్నడూ రియల్‌లైఫ్‌లో నటించను. ఆ అవసరం నాకు రాలేదు’ అని అలియా భట్ చెప్పుకొచ్చింది.
కాగా.. ఆలియా భట్, రణబీర్ కపూర్ ఇద్దరూ ప్రేమలో మునిగితేలుతున్నారు. అంతేకాదు ఈ జంట కెమెరా కంట సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి. ఒకానొక సందర్భంలో ఈ జంట 2020లో పెళ్లి పీఠలెక్కబోతున్నట్లు బాలీవుడ్‌లో ఊహాగానాలు పెద్ద ఎత్తున వస్తున్నాయి. తాజాగా ఆలియా ఇంటర్వ్యూలో చెప్పిన వ్యక్తి రణబీరా కాదా అన్నది తెలియాలంటే ఈమె పెళ్లి పీఠలెక్కేవరకు వేచి చూడాల్సిందే మరి.'

బీజేపీ వర్సెస్ టీడీపీ. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సెంటర్‌గా మాజీ మంత్రి మాణిక్యాలరావు, జిల్లా జెడ్పీ ఛైర్మన్ బాపిరాజులు ఢీ అంటే ఢీ అన్నారు. గురువారం అవినీతి, అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ కాలు దువ్వారు. సవాళ్లు, ప్రతి సవాళ్లతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కగా.. చివరికి నేతల్ని పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. 144 సెక్షన్ ఇంకా అమలులోనే ఉంది.
అసలు విషయానికొస్తే.. మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు.. తాడేపల్లి గూడెం టీడీపీ నేతలు టార్గెట్‌గా విరుచుకుపడ్డారు. నియోజకవర్గంలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయన్నారు. ఉచిత ఇసుక పేరుతో తెలుగు దొంగలు రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దీనికి టీడీపీ కౌంటరిచ్చిన టీడీపీ.. అవినీతి, అక్రమాలపై చర్చకు రావాలంటూ సవాల్ విసిరింది. జెడ్పీ ఛైర్మన్ ముళ్లపూడి బాపిరాజు గురువారం చర్చకు రెడీ అన్నారు.
ఈ క్రమంలోనే బాపిరాజు బుధవారం రాత్రి మాణిక్యాల రావు ఊరైన వెంకట్రామన్నగూడెం చేరుకున్నారు. స్థానిక టీడీపీ కార్యకర్త ఇంట్లో ఉన్నారు. గురువారం ఇద్దరు నేతలు చర్చకు సిద్ధం కావడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తు జాగ్రత్తగా బాపిరాజుతో పాటూ మాణిక్యాలరావును హౌస్ అరెస్ట్ చేశారు. అలాగే 144 సెక్షన్‌ను అమలు చేశారు. తాడేపల్లిగూడెం మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం దగ్గర కూడా పోలీసుల్ని మోహరించారు. అయితే పోలీసుల్ని దాటుకొని బయటకు వచ్చేందుకు మాణిక్యాలారావు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకొని ఇంట్లో దిగ్భందించారు.
ఇదిలా ఉంటే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జీవీఎల్‌తో కలిసి మాణిక్యాలరావును కలిసేందుకు విజయవాడ నుంచి బయల్దేరారు. సమాచారం అందుకున్న పోలీసులు.. కనకదుర్గమ్మ వారధి దగ్గర వారిని అడ్డుకున్నారు. దీంతో కన్నా రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్ష పాలన సాగుతోందన్నారు. రాష్టంలో ఎవరికీ రక్షణ లేకుండా పోతోందని.. తమ పార్టీ ఎమ్మెల్యేను పరామర్శించడానికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకోవడం దారుణమన్నారు. మాణిక్యాలరావును అక్రమంగా అరెస్ట్‌ చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
ఆపద్ధర్మ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రజా గాయకుడు గద్దర్‌ పేర్కొన్నారు. గురువారం విలేకరులతో మాట్లాడుతూ… తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీలను కలవడం వెనుక ఎటువంటి రాజకీయ ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. వారితో జరిగిన భేటీలో 45 నిమిషాల పాటు పాట పాడి వినిపించానని తెలిపారు. అంతే కాకుండా రాహుల్‌కు ‘సేవ్‌ కాన్‌స్టిట్యూషన్‌ సేవ్‌ డెమొక్రసీ’  గురించి వివరించానని పేర్కొన్నారు. ఢిల్లీలో సీఐడీ అడిషినల్‌ డీజీని కలిసి తనకు భద్రతా కల్పించాలని కోరానని, ఈ విషయమై సీఈఓకు కూడా వినతిపత్రం సమర్పించానని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ అన్న కూతురు, కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కల్వకుంట్ల రమ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లిలోని ఏపీసచివాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆమె టిక్కెట్ కోసం ఆయనతో చర్చించి ఉంటారని భావిస్తున్నారు.
చంద్రబాబు ఢిల్లీకి వెళ్లిన సమయంలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి తదితరులు ఆయనను టిక్కెట్ల అంశంపై కలిశారు. రాజేంద్రనగర్ నుంచి పోటీ చేయాలనుకుంటున్న కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కూడా ఢిల్లీలో ఆయనను టిక్కెట్ కోసం కలిశారు. ఇప్పుడు రమ్య కలిశారు.
ఇదిలా ఉండగా, ఇటీవల రమ్య ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడుపై ప్రశంసలు కురిపించారు. తనకు స్ఫూర్తి చంద్రబాబు అని చెప్పారు. ఆయన మంచి అడ్మినిస్ట్రేటర్ అని, మంచి స్ట్రాటజీ కలిగిన వ్యక్తి అని, మంచి వ్యక్తిత్వం కలిగిన నాయకుడు అని, ఆయన తన కోసం కాకుండా విజన్‌తో కలిసి పని చేస్తారని, ఇప్పుడు తనకు నష్టం జరిగినా పర్వాలేదు.. భవిష్యత్తులో ప్రజలకు న్యాయం జరగాలని కోరుకుంటారని, ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి అని చెప్పారు. ఈ లక్షణాలు ఉన్న వ్యక్తిగా చంద్రబాబును తాను గౌరవిస్తానని, అభిమానమని రమ్య చెప్పారు.
కేసీఆర్ అన్న కూతురుగా తాను చంద్రబాబు వద్ద పని చేస్తే ప్రజల్లోకి తప్పుడు సందేశాలు వెళ్తాయని ఊరుకున్నానని, కానీ ఓ మంచి నాయకుడి కింద పని చేసే అవకాశం కోల్పోయాననే బాధ ఎప్పటికీ ఉంటుందన్నారు. చంద్రబాబు చాలా సిన్సియర్‌గా ప్రజల కోసం పని చేస్తారని రమ్య చెప్పారు. తన పార్టీ అధికారంలో ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదని, కానీ ఆయన ప్రజల కోసం పని చేయాలనుకుంటారని, తాను అతనిని కొన్నిసార్లు కలిశానని చెప్పారు. ఆయన అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు ఉన్న వ్యక్తి అన్నారు. పార్టీలు వేరైనా ఆయన రాజకీయంగా ఆయన వ్యక్తిత్వం గొప్పదన్నారు. విభజన అనంతరం చంద్రబాబు మనోధైర్యంతో మాట్లాడారని, తెలంగాణ ఇస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందని, అదే సమయంలో ఏపీకి న్యాయం చేయాలని మనోధైర్యంతో చెప్పారన్నారు.

డిసెంబర్ నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై గెలిచి తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతానని కాంగ్రెస్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గం నేత వంటేరు ప్రతాప్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ పైన తనకు చాలా గౌరవం ఉందని, అయితే ఆయన పరిపాలనే అధ్వాన్నంగా ఉందని చెప్పారు.
కేసీఆర్, హరీష్ రావులపై తనకు వ్యక్తిగత కక్ష ఏమీ లేదని వంటేరు చెప్పారు. తాను ఎప్పుడు కూడా పేదల పక్షాన్నే ఉంటానని చెప్పారు. వారికి న్యాయం చేయడమే తన అభిమతమని అన్నారు. తాను నిత్యం నియోజకవర్గంలోనే ఉంటున్నానని, ప్రజలు తనను గెలిపిస్తారనే నమ్మకం ఉందని చెప్పారు. గజ్వెల్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు ప్రజలను ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బిర్యానీ, బీరు పంపిణీ చేస్తూ ప్రజలను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలన్నారు.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో గురువారం తెలంగాణ టీడీపీ నేతలు ఎల్ రమణ, రావుల చంద్రశేఖర రెడ్డి తదితరులు భేటీ అయ్యారు. తెలంగాణలో పొత్తులు, సీట్ల సర్దుబాటుపై వారు చర్చించారు. ఈ సందర్భంగా మనకు తెలంగాణలో సీట్లు ముఖ్యం కాదని, టీఆర్ఎస్ ఓటమి ముఖ్యమని ఆయన మరోసారి తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఎక్కువ సీట్లలో పోటీ చేయడం మన లక్ష్యం కాదని, ఇచ్చిన సీట్లలో గెలవడం ముఖ్యమని, అదే విధంగా టీఆర్ఎస్ ఓటమి ముఖ్యమని చెప్పారని తెలుస్తోంది. మనకు కాంగ్రెస్ ఇచ్చిన స్థానాలు తీసుకోవాలని, మిగతా చోట్ల అసంతృప్తులు ఉంటే తాను స్వయంగా మాట్లాడుతానని చంద్రబాబు చెప్పారని తెలుస్తోంది. కానీ మనకు సీట్ల సంఖ్య మాత్రం ముఖ్యం కాదని చెప్పారు. గతంలోను ఇదే విషయాన్ని చెప్పారు.

ఆరోగ్య చిట్కాలు

Ads Place 970 X 90

సంపాదకీయం

ప్రత్యేక కథలు

కవిత్వం