తాజా వార్తలు

Saturday, 22 August 2015

సెప్టెంబర్ 24న సుబ్రహ్మణ్యం ఫర్ సేల్


సాయి ధరం తేజ్ హీరో గా, హరీష్ శంకర్ దర్శకుడి గా, దిల్ రాజు నిర్మాణ సారధ్యంలో రూపుదిద్దుకున్న భారీ కమర్షియల్ ఎంటర్ టైనర్, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సెప్టెంబర్ 24 న  విడుదల కానున్నది. అమెరికాలో 35 రోజుల పాటు ఎన్నో అందమైన ప్రదేశాలలో షూటింగ్ జరుపుకున్న ఈ చిత్రం ఇప్పుడు విడుదలకు సిద్ధం అవుతోంది. మెగాస్టార్  చిరంజీవి పుట్టిన రోజు అయినటువంటి ఆగష్టు 22న ఈ చిత్రం ఆడియోను విడుదల చేసి, సెప్టెంబర్ 24న భారీ స్థాయిలో చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నామని దిల్ రాజు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చే చిత్రాలకు ఉండే ఉన్నతమైన సాంకేతిక విలువలు, హరీష్ శంకర్ రాసే పదునైన సంభాషణలు, సాయిధరం తేజ్ అధ్బుతమైన డాన్స్, నటన, రెజినా గ్లామర్  ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి అని చిత్ర బృందం చెబుతోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment