తాజా వార్తలు

Saturday, 22 August 2015

సెప్టెంబర్ 4న విశాల్, కాజల్ ‘జయసూర్య’ విడుదలవిశాల్ మరో చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నడు. సుశీంద్రన్ దర్శకత్వంలో ‘పాయుమ్ పులి’గా తమిళంలో రూపొందుతున్న చిత్రం తెలుగులో ‘జయసూర్య’గా విడుదల చేస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. విశాల్ ఈ సినిమాలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తాడు. ఈ చిత్రంలో విశాల్ సరసన కాజల్ జంటగా నటించింది.  ఆగస్ట్ 21 చిత్ర ఆడియోను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. విశాల్, కాజల్ అగర్వాల్, సముద్రఖని, సూరి, హారీష్ ఉత్తమన్, మురళీశర్మ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి డి.ఇమాన్ సంగీతం అందించారు.ఈ చిత్రాన్ని సర్వానంద రామ్ క్రియేషన్స్ పతాకంపై వడ్డి రామానుజం సారధ్యంలో జివ్వాజి రామాంజనేయులు తెలుగు ప్రేక్షకులను అందిస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment