తాజా వార్తలు

Friday, 28 August 2015

రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ పై అవినితీ కేసు నమోదు


రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, మాజీ ఎంపీ సచిన్ పైలెట్‌ పై సీబీఐ  క్రిమినల్ కేసును నమోదు చేసింది. అశోక్ గెహ్లాట్, సచిన్ పైలెట్‌లు అధికారంలో ఉండగా అంబులెన్స్ ల కేటాయింపుపై అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు వెళ్లివెత్తడంతో సీబీఐ విచారణ చేపట్టింది. వివరాల్లోకి వెళితే 2009లో జీగిత్‌జా హెల్త్‌కేర్ కంపెనీకి 100 అంబులెన్స్‌లను కేటాయించారు. కంపెనీ డైరెక్టర్లలో సచిన్ పైలట్, మాజీ కేంద్రమంత్రి వాయలర్ రవి కుమారుడు రవికృష్ణ, మరో మాజీ కేంద్రమంత్రి చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం డైరెక్టర్లలో ఒకరుగా ఉన్నారు. ఈ అంబులెన్స్‌లు రాజస్థాన్‌తో పాటు బీహార్, పంజాబ్‌లో సేవలను అందించేవి. రాష్ట్ర ఆడిట్‌లో ఆర్థిక నియమావళిని ఉల్లంఘించి అవకతవకలకు పాల్పడుతూ, రూ. 14 కోట్ల మేర నష్టాల్లో ఉన్నప్పటికీ అంబులెన్స్‌ల సేవలను కొనసాగించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ కేసును మొదటగా రాష్ట్ర క్రైం బ్రాంచ్ పోలీసులు విచారణ చేపట్టారు. పోలీసుల వద్ద నుంచి కేసు సీబీఐకు మారింది.  
« PREV
NEXT »

No comments

Post a Comment