తాజా వార్తలు

Wednesday, 26 August 2015

బాబుగారు ఎన్టీఆర్ పై చేసిన వెన్నుపోటుకు ముహూర్తమంటా ఈ రొజు!మరి ప్రస్తుతం ఢిల్లీలో ఈ రోజున బాబుగారు బిజీగా ఉన్నారో ఏమో కానీ... ఈ రోజుకు చాలా ప్రత్యేకత ఉంది. అదేమంటే.. బాబుగారు ఎన్టీఆర్ పై చేసిన వెన్నుపోటు ముహూర్తం ఇది. 1995 సంవత్సరం ఆగస్టు 26 వ తేదీన అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బాబుగారి ఆధ్వర్యంలో కొంతమంది ఎమ్మెల్యేలు వేరు కుంపటి పెట్టుకొన్నారు. అసలు తెలుగుదేశం తమదేనని క్లైమ్ చేసుకొన్నారు. 
అప్పటికి ఎనిమిది నెలల కిందట ఏర్పడిన ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్పకూలింది. ప్రజాతీర్పును అపహస్యం చేస్తూ ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచి దించేశారు. మొత్తం 170 మంది ఎమ్మెల్యేలు తమ వెంట ఉన్నారని బాబు గారు ఇదే రోజున ప్రకటించుకొన్నారు. అయితే ఎన్టీఆర్ ఈ ప్రకటనను ఖండించారు. "ఈనాడు'' ను అడ్డం పెట్టుకొని చంద్రబాబు తనకు వెన్నుపోటు పొడుస్తున్నాడని మొత్తుకొన్నారు. గొడ్డుకన్నా ఘోరం..గాడ్సే కన్నా హీనం.. అంటూ పవర్ ఫుల్ పంచ్ లతో ఎన్టీఆర్ చంద్రబాబుపై విరుచుకుపడ్డాడు. తన ఘోషను తెలుగువారికి వినిపించాడు.
అయితే.. ఆయనది అరణ్య రోదనే అయ్యింది. లక్ష్మీ పార్వతి జోక్యాన్ని తక్షణ కారణంగా చూపుతూ బాబు గారి ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు విజయవంతం అయ్యింది. ఆ తర్వాత బాబుగారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడటం... ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత ఎన్నో పరిణామాలు జరిగాయి. ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. ఇప్పుడు ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ మళ్లీ సొంతం చేసుకొంది. ఇటీవల మళ్లీ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఆయనకు భారతరత్న అవార్డు ను కూడా తెగ డిమాండ్ చేసేస్తోంది! కాలమహిమ. 
« PREV
NEXT »

No comments

Post a Comment