తాజా వార్తలు

Wednesday, 26 August 2015

తెలంగాణలో బార్ లైసెన్స్‌ల మార్గదర్శకాలు విడుదల చేసిన ప్రభుత్వంనూతన బార్‌లకు లైసెన్స్‌లు ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం 2015-16కు సంబంధించి బార్‌లైసెన్స్‌ల విధివిధానాలను విడుదల చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, మేజర్ మున్సిపాలిటీలు, నగర పంచాయితీల్లో కూడా బార్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతీ 30వేల మందికి ఒక బార్ చొప్పున లైసెన్స్ ఇవ్వబోతున్నట్లు ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల్లో ఉంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 13వేల జనాభాకు ఓ బార్ లైసెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు గతానికి కంటే భిన్నంగా ఉన్నాయి. ఈ నిర్ణయంతో బార్‌ల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అటు త్రీస్టార్ హోటళ్లలోనూ మద్యం అమ్మకాలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది.
« PREV
NEXT »

No comments

Post a Comment