తాజా వార్తలు

Saturday, 29 August 2015

రేషన్ బియ్యం అమ్ముకునే వారిపై కఠిన చర్యలు-ఈటెల

రేషన్ బియ్యం తీసుకొని అమ్ముకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు. పేదవాళ్లకు కడుపునిండా అన్నం పెట్టాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉద్ఘాటించారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ ఇస్తామని  తేల్చిచెప్పారు. తెలంగాణలో గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబం ఉండకూడదన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని చెప్పారు. కరీంనగర్‌లో అందరికీ గ్యాస్ కనెక్షన్ పథకాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. మూడు, నాలుగు నెలల్లో అన్ని జిల్లాల్లో గ్యాస్ స్కీమ్‌ను అమలు చేస్తామన్నారు. తెలంగాణలో అక్రమాలకు తావు లేదు అనే స్థాయికి వ్యవస్థను తీసుకొచ్చామని చెప్పారు. అక్రమాలు అరికట్టే విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment