తాజా వార్తలు

Monday, 31 August 2015

ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌ లో ఆర్తిఅగర్వాల్ ఉగ్రరూపం

'ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌'లో ఆర్తి అగర్వాల్‌ ఉగ్రరూపం చూపించింది. ముకుల్‌ దేవ్‌ ప్రధానపాత్రల్లో ఖాన్‌ ప్రొడక్షన్స్‌ ప్రైలిమిటెడ్‌ బ్యానర్‌పై టైమ్‌ మీడియా సమర్పణలో భరత్‌ పారేపల్లి దర్శకత్వంలో ఎన్‌.ఎ.ర్రహ్మాన్‌ ఖాన్‌ నిర్మిస్తున్న సినిమా 'ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌'. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, తమిళం, మలయాళంలలో విడుదలచేయనున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్‌, ట్రైలర్స్‌ను హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో విడుదలచేసారు. ఈ సందర్భంగా దర్శకుడు భరత్‌ పారేపల్లి మాట్లాడుతూ ఎంతో ఆనందంతో ఈ చిత్రాన్ని మొదలు పెట్టాం. రిలీజ్‌ చేసే సమయానికి ఆర్తి అగర్వాల్‌ మరణించడం బాధాకరమైన విషయం. ఈ చిత్రాన్ని ఆమెను చివరిచూపు చూసేలా ప్రేక్షకులకు అందివ్వనున్నాం అని చెప్పారు. నిర్మాత ఎన్‌.ఎ.ర్రహ్మాన్‌ ఖాన్‌ మాట్లాడుతూ నక్సలిజాన్ని పట్టుకోవడానికి ఏర్పాటు చేసిన బృదం పేరు 'ఆపరేషన్‌ గ్రీన్‌ హంట్‌'. మేము చెప్పాలనుకున్న విషయాలను సినిమా ద్వారా చెప్తున్నాం. ఇదొక హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ మూవీ. త్వరలోనే ఆడియో రిలీజ్‌ చేసి చిత్రాన్ని ప్రేక్షలకు ముందుకు తీసుకురానున్నాం అని చెప్పారు. అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ ఇదొక రివల్యూషన్‌ సినిమా. సమజాన్ని బాగుపరచాలనే ఉద్దేశ్యంతో కొందరు అడవుల్లో ఉండి పోరాడి ప్రాణాలను సైతం కోల్పోతున్నారు. కాజా సూర్యనారాయణరావు, నరసింహారెడ్డి, కాదంబరి కిరణ్‌, శివాజీరాజా, శ్రీరాహుల్‌, మోహన్‌ వడ్లపట్ల, సత్యరెడ్డి రుద్రమరాజు పద్మరాజు ఉన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment