తాజా వార్తలు

Friday, 28 August 2015

వెల్లుల్లితో రెండింతల రోగనిరోధక శక్తి


రోగనిరోధక శక్తిని వెల్లుల్లి రెండింతలు చేస్తుంది. జ్వరాల నుండి త్వరగా కోలుకోవడానికి, రొంప నుండి బైట పడటానికి వెల్లుల్లిరసం, తేనెల మిశ్రమం దివ్య ఔషధంగా పని చేస్తుంది. వెల్లుల్లిలో ఉండే గంధకం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వెల్లుల్లి యాంటీ బయాటిక్‌గా, యాంటీ వైరస్‌గా పని చేయడానికి ఈ గంధకమే కారణం. ఔషధంగా వెల్లుల్లి ఉపయోగాలు చాలా ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థను శుద్ధి చేస్తుంది. జీర్ణాశయానికి వచ్చే కేన్సర్‌ను నివారిస్తుంది. ఆస్తమను అరికడుతుంది. జలుబు, దగ్గును నివారిస్తుంది. దురదకు, పగుళ్ళకు, తామరకు, పుండ్ల నివారణకు వాడవచ్చు. నోటిపూతను తగ్గిస్తుంది. రక్తంలో పేరుకున్న కొవ్వును కరిగిస్తుంది. దీర్ఘకాలిక జ్వరాలకు త్వరితంగా ఉపశమనం కలిగిస్తుంది. గర్భిణుల ఆరోగ్యాన్ని నిలకడగా ఉంచుతుంది. బాలింతలకు పాలు బాగా పడేలా చేస్తుంది. రక్తపోటును కంట్రోల్‌ చేస్తుంది. 
« PREV
NEXT »

No comments

Post a Comment