తాజా వార్తలు

Saturday, 22 August 2015

తేనే, దాల్చినచెక్క కలిపితే దివ్య ఔషదమే…


అధికబరువుసమస్యను అధిగమించేందుకు తేనే ఎంతో ఉపయోగపడుతుంది. ఉదయాన్నేఅల్పాహారానికి ముందు,

రాత్రి నిద్రకు వుపక్రమించేముందు ఒక పెద్ద చెంచా తేనె, 1/2 చిన్న చెంచా దాల్చినపొడి ఒక కప్పు నీళ్ళల్లో మరిగించి తీసుకోవాలి. ఇది క్రమం తప్పకుండా సేవిస్తే అధిక బరువుని నియంత్రించి మరింత కొవ్వు పెరగకుండా చూస్తుంది. అంతేకాకుండా తేనెతోపాటు దాల్చినచెక్కతోడయితే రోజూ మనం ఎదుర్కొనే ఆరోగ్యసమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకే చాలామంది తేనెను రాంబాణంతో పోల్చుతారు. ఏవ్యాధికైనా తేనెను వాడవచ్చు ప్రతికూల లక్షణాలు ఏమీవుండవు. డయాబెటిస్ సమస్య వున్న వాళ్ళు కూడ తగు మోతాదులో తీసుకోవచ్చు. తేనె దాల్చినచెక్క పొడి బాగ కలిపి రొట్టెముక్కలపై పరచి జాం లాగ వాడాలి ఇలాక్రమం తప్పకుండా వాడితే కొలెస్ట్రాల్ రక్తనాళాలనుంచి తగ్గించి గుండె పోటు రాకుండా కాపాడుతుంది. రోజూ పొద్దున్న సాయంత్రం ఒక కప్పు వేడినీళ్ళలో ఒక చెంచా తేనె అరచెంచా దాల్చిన పొడి ఒక్ నెలె రోఫుల పాటు వాడితే నోప్పులు మటుమాయమవుతాయి. రెండు పెద్ద చంచాల దాల్చిన పొడి ఒక చిన్నచెంచాతేనె ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలుపుకొని క్రమం తప్పకుండా వాడితే మూత్రాశయంలోని బాక్టీరియాను నాశనంచేస్తుంది. రెండుపెద్దచెంచాలు దాల్చినపొడి మూడు చిన్నచెంచాలు తెనె అరగ్లాసు టీనీళ్ళతో కలుపుకొని తాగితే కొలెస్ట్రాల్ అదుపులో వుంటుంది. ఒకపెద్దచెంచాతేనె, పావుచిన్నచెంచా దాల్చినపొడి కలుపుకొని మూడురోజులు సేవిస్తే జలుబు, దగ్గు తగ్గుతుంది. ఒకపెద్దచెంచా దాల్చినపొడి ఒకచిన్నచెంచాతేనె కలుపుకొని తాగితే ఉదర సంబందిత సమస్యలు, గ్యాస్, పరిష్కారం అవుతాయి.

« PREV
NEXT »

No comments

Post a Comment