తాజా వార్తలు

Sunday, 30 August 2015

ఆగస్ట్ 31నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఆగస్ట్ 31 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజుల పాటు సమవేశాలు వాడీవేడీగా సాగనున్నాయి. ప్రజాసమస్యలపై అసెంబ్లీలో తమ వాణివినిపించేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ సర్వం సన్నద్ధమైంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న ఈసమావేశాల్లో....మొత్తం 19 అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు వైసీపీ సమాయత్తమయ్యింది. ప్రత్యేక హోదా, భూసేకరణ, ఓటుకు నోటు కేసు, పుష్కరాల్లో తొక్కిసలాట, రితికేశ్వరి మరణం సహా అనేక అంశాలపై చర్చకు పట్టుబట్టనున్నారు. స్పెషల్ స్టేటస్ కోసం ప్రజలు ఆత్మబలిదానాలు చేసుకుంటున్నా బాబు సర్కార్ లో ఎలాంటి కదలిక లేదని విమర్శిస్తున్నారు. ఇక రాష్ట్రమంత్రి నారాయణ విద్యాసంస్థల్లోనే విద్యార్థుల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని, వరుస ఆత్మహత్య ఘటనలు కలకలం రేపుతున్నా మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవన్నారు. ర్యాగింగ్ కు విద్యార్థినుల ప్రాణాలు బలవుతున్నా వాటిని అరికట్టడంలో ఘోరంగా విఫలమవుతున్నారని దుయ్యబట్టారు. సీజనల్  వ్యాధులతో ప్రజలు మృత్యువాత పడుతున్నా వైద్య,ఆరోగ్యశాఖకు పట్టడం లేదు.   
« PREV
NEXT »

No comments

Post a Comment