తాజా వార్తలు

Monday, 31 August 2015

కరివేపాకు ఏరిపారేస్తే..అనారోగ్యాన్ని పిలిచినట్టే

కరివేపాకు మంచిదని అందరికీ తెలుసు. కానీ, ఇష్టంలేకో లేక అలవాటులో పొరపాటో… కరివేపాకుని తినకపోవడానికి సవాలక్ష కారణాలు. కానీ, కరివేపాకు ప్రాశస్త్యం తెలిస్తే చక్కగా అన్ని వంటల్లో ఇంత కరేపాకు ఏరిపారేయడానికి వీలు లేకుండా ఎలా వేయొచ్చో తప్పకుండా ఆలోచిస్తారు. కరివేపాకులో శరీరానికి ఎంతో అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లూ, బి విటమిన్, కెరోటిన్ పుష్కలంగా ఉండటమే కాదు.. తాజా కరివేపాకు నుంచి ప్రొటీన్లు, కొవ్వు పదార్ధాలు, పిండి పదార్ధాలు, పీచు పదార్ధాలు, ఖనిజ లవణాలు, క్యాలరీలు కూడా లభిస్తాయి. ఇలా పౌష్టిక విలువలలో ఏ కూరకీ ఏమాత్రం తీసిపోని కరివేపాకుని కేవలం రుచి గురించి మాత్రమే వాడతాం మనం. పూర్వమయితే కరివేపాకు పొడులు, కరివేపాకు పచ్చడి అంటూ కరివేపాకు వినియోగం కొంచెం ఎక్కువగానే వుండేది. కానీ, ఫాస్ట్‌ఫుడ్ కల్చర్‌లో కరివేపాకు వెనుకబడిపోయింది. మనం ఎవరి ఫాస్ట్‌ఫుడ్స్‌ని అలవాటు చేసుకుని కరివేపాకుకి దూరమవుతున్నామో వారు మాత్రం కరివేపాకుని భారీగా వినియోగిస్తారంటే నమ్ముతారా! మన దేశం నుంచి సుమారు 900 టన్నుల వరకు కరివేపాకు విదేశాలకు ఎగుమతి అవుతోందిట. గల్ఫ్ దేశాలలో మన కరివేపాకుకి బోలెడంత డిమాండ్. ఐరోపా వాసులైతే ఎండబెట్టిన కరివేపాకు ఆకుల పొడి వాడతారుట. కరివేపాకును తినేటప్పుడు ఏరివేయకుండా..ఇక తింటారుగా…
మరోవైపు కరివేపాకు ఆకులని పాలల్లో నూరి అందులో కాస్త ముల్తానిమట్టిని కలిపి ముఖానికి రాస్తే క్రమంగా ముడతలు తగ్గి, ముఖ తేజస్సు పెరుగుతుంది.

« PREV
NEXT »

No comments

Post a Comment