తాజా వార్తలు

Monday, 31 August 2015

ప్రతి పేద కుటుంబానికి శ్రీనిధి ఆర్థిక సేవలు-కేటీఆర్

సచివాలయంలో శ్రీనిధిపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి పేద కుటుంబానికి శ్రీనిధి ఆర్థిక సేవలు అందేలా కార్యాచరణ రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.   వెనకబడిన దళిత కుటుంబాలకి స్వయం ఉపాధి పొందేలా ప్రణాళికలు వేయాలన్నరు. రుణ వితరణతోపాటు బీమా సేవలు అందించే అంశాన్ని పరిశీలించాలన్నరు. 2015-16 సంవత్సరానికి 1050 కోట్ల క్రిడిట్ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు మంత్రి కేటీఆర్ కు శ్రీనిధి అధికారులు తెలిపారు. శ్రీనిధి సంస్థ ఆర్థిక సంస్థగానే కాకుండా సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్న సంస్థగా రూపొందించాలని కేటీఆర్ ఆకాంక్షించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment