తాజా వార్తలు

Sunday, 23 August 2015

విపక్షాలు గుడుంబాకు మద్దతు పలుకుతున్నాయా?- నాయిని


గుడుంబా నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం దారుణమని హోంమంత్రి  నాయిని అన్నారు. గత ప్రభుత్వాలు గుడుంబాను నియంత్రించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. గుడుంబా వల్ల ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పకుండా గుడుంబాను నియంత్రిస్తమని తెలిపారు.  చీప్ లిక్కర్ విధానాన్ని ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు అనవసర రాధ్ధాంతం చేస్తున్నాయని  అన్నారు. గుడుంబా కారణంగా వందలాది మంది ప్రాణాలు పోతున్నాయని, అందుకే ప్రభుత్వం ఆరోగ్యకరమైన చీప్‌లిక్కర్‌కు అనుమతి ఇస్తున్నట్టు వ్యాఖ్యానించారు. చీప్‌లిక్కర్‌ను వ్యతిరేకిస్తోన్న ప్రతిపక్షాలకు దమ్ముంటే గుడుంబాకు మధ్దతు పలకాలని సూచించారు.  పేద విద్యార్థులతో పాటు మానసిక వికలాంగుల్లో ధైర్యం నింపే ఇలాంటి కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం ఉంటుందని నాయిని చెప్పారు.  కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించాలని నిర్ణయం తీసుకున్నమని చెప్పారు. విద్యలో తెలంగాణ మొదటి స్థానానికి చేరుకునేలా కృషి చేస్తామని నాయిని తెలిపారు. అంగవైకల్యంతో ఇబ్బంది పడుతోన్న విద్యార్థుల్లో స్థైర్యం నింపేందుకు ఫోర్ట్ ఎస్టేట్ సంస్థ హైదరాబాద్ లో5కే రన్‌ నిర్వహించింది. నెక్లెస్‌రోడ్ పీపుల్స్‌ప్లాజా వేదికగా ఈ రన్‌ను తెలంగాణా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు.ఈ రన్ ఏర్పాటు చేసిన నిర్వాహకులను అభినందించారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment