తాజా వార్తలు

Friday, 28 August 2015

జర్నలిస్టులు, ప్రైవేటు డ్రైవర్లు, హోంగార్డులకు 5 లక్షల ప్రమాదబీమా


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులు, ప్రైవేటు డ్రైవర్లు, హోంగార్డులకు ప్రమాద బీమా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. జర్నలిస్టులు, ప్రైవేటు డ్రైవర్లు, హోంగార్డులకు రూ. 5 లక్షల బీమా ప్రభుత్వం కల్పిస్తుందని  కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. ప్రమాద బీమా ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రమాద బీమాతో 10 లక్షల మంది లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. 22-08-2015 నుంచి ప్రమాద బీమా వర్తిస్తుందని చెప్పారు.     

« PREV
NEXT »

No comments

Post a Comment