తాజా వార్తలు

Friday, 28 August 2015

గన్ కల్చర్ పై వైట్ హౌజ్ లో కదలిక


వర్జీనియాలో టివీ జర్నలిస్టులను లైవ్ లో కాల్చిన సంఘటనపై వైట్ హౌజ్ లో కూడా కదలిక మొదలైంది. దేశంలో పెరుగుతున్న గన్ కల్చర్ ను నియంత్రించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఆయుధాలను నియంత్రించేందుకు త్వరలోనే  చట్టాన్ని తేనున్నట్లు వైట్ హౌజ్ వర్గాలు తెలిపాయి. అయితే తమ కాలంలో గన్ కంట్రోల్ చట్టాన్ని కఠినతరం చేయడంలో నిస్సాహులమైనందుకు అధ్యక్షుడు బరాక్ ఒబామా విచారం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా చిన్న,పెద్ద కమ్యూనిటీలో ఇది సర్వసాధారణమైందని వైట్  హౌజ్ ప్రతినిధి జాన్ ఎర్నెస్ట్ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో గన్ కల్చర్ నిర్మూలించేందుకు తాము కృతనిశ్చయంతో ఉన్నామని జాన్ ఎర్నెస్ట్  తెలిపారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment