తాజా వార్తలు

Monday, 31 August 2015

హుదూద్ తుఫాన్ బాధితులకు ప్రపంచబ్యాంకు భారీ ప్యాకేజీ

హుదూద్  తుఫాన్ బాధితులను ఆదుకునేందుకు ప్రపంచబ్యాంకు భారీ ప్యాకేజీ ప్రకటించింది. హుదూద్ తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన నాలుగు జిల్లాలకు రూ.2220 కోట్ల ఆర్థిక సాయం చేయనున్నట్టు ప్రపంచ బ్యాంకు ప్రకటించింది. గత యేడాది హుదూద్ తుఫాను విశాఖపట్టణంతో పాటు మొత్తం నాలుగు జిల్లాల్లో పెను విధ్వంసం సృష్టించిన విషయం తెల్సిందే. ఈ ప్రాంతాన్ని ఆదుకునేందుకు వీలుగా ఈ ఆర్థిక సాయం చేస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రతినిధులు ప్రకటనలో తెలిపారు.
« PREV
NEXT »

No comments

Post a Comment