తాజా వార్తలు

Saturday, 22 August 2015

ముగ్గురు ఢిల్లీ ఎమ్మెల్యేలపై వేటు?

 
ఫోర్జరీ, మోసం, పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడిన ముగ్గురు ఢిల్లీ ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి ఆమ్ ఆద్మీ పార్టీ సిద్ధమవుతోంది. అవినీతి వ్యతిరేక ఎజెండాతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రక్షాళనకు నడుంకట్టింది. అధినేత అరవింద్ కేజ్రీవాల్ ను సవాలు చేసిన ఇద్దరు అగ్రనేతలను ఇప్పటికే పార్టీ నుంచి సాగనంపారు.స్పీకర్ అనుమతి ద్వారా వారి శాసన సభ్యత్వాన్ని రద్దు చేయించాలని ఆప్ అధినాయకత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. తమ పార్టీ చట్ట వ్యతిరేక పనులను సమర్థించబోదనే నమ్మకాన్ని ప్రజల్లో కలిగించాలంటే ఈ చర్యలు తప్పనిసరి అని ఆప్ నేతలు భావిస్తున్నారు. ఢిల్లీలో పార్టీ పట్టు సడలిపోకుండా కాపాడుకోవడానికి ఆప్ అధిక ప్రాధాన్యం ఇస్తోంది.  ఇప్పుడు అనూహ్యంగా పోలీసు కేసులను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై వేటు వేయడానికి రంగం సిద్ధమవుతున్నట్టు సమాచారం.  
« PREV
NEXT »

No comments

Post a Comment