తాజా వార్తలు

Friday, 28 August 2015

ప్రాణాలతో మరో ఉగ్రవాదిని పట్టుకున్న ఆర్మీ


భారత సైన్యం పాకిస్థాన్‌ కు చెందిన మరో ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకున్నది. జమ్ముకశ్మీర్‌ లోని బారాముల్లా జిల్లా రఫియాబాద్ ప్రాంతంలోని వాస్తవాధీన రేఖ వెంట జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చిన భద్రతా బలగాలు, సజ్జాద్  అనే ఉగ్రవాదిని ప్రాణాలతో పట్టుకొన్నాయి. అతడిని పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన ముజఫర్‌గఢ్‌వాసిగా గుర్తించారు. అతని వద్ద నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లు, జీపీఎస్ పరికరం స్వాధీనం చేసుకొన్నారు. ఇతనితో నెల వ్యవధిలోనే ప్రాణాలతో పట్టుకున్న పాక్ ఉగ్రవాదుల సంఖ్య రెండుకు పెరిగింది.  
« PREV
NEXT »

No comments

Post a Comment