తాజా వార్తలు

Saturday, 22 August 2015

5 కోట్లతో సీఎం చంద్రబాబు కొత్తబస్సు


ఏపీ సీఎం చంద్రబాబుకు 5 కోట్ల రూపాయలతో ఆధునిక సౌకర్యాలతో నూతన బస్సును ఏర్పాటు చేశారు.   బుల్లెట్ ప్రూఫ్, బాంబుదాడులను తట్టుకునేలా బస్సుకు రూపకల్పన చేశారు. బస్సు నిర్వహణ బాధ్యతను ప్రభుత్వం ఆర్టీసీకే అప్పగించింది. బస్సును సీఎం చంద్రబాబు పరిశీలించారు. బస్సులోపల సిట్టింగ్, ఇంటీరియర్లలో కొద్దిపాటి మార్పులు చేయాలని బాబు సూచించినట్లు సమాచారం. బెంజ్ కంపెనీకి చెందిన ఈబస్సు చండీగడ్ లోని జేసీబీఎల్ కంపెనీలో బాడీ బిల్డింగ్ చేయించారు.  బస్సుకు చుట్టూ అమర్చిన ప్రత్యేక కెమెరాల ద్వారా బయట ఏం జరుగుతుందో లోపలి టీవీ ద్వారా గమనించవచ్చు. డ్రైవర్ కు సైతం కెమెరాల ద్వారా రోడ్డు క్లారిటీ, ట్రాఫిక్ గమనించే సౌకర్యం కూడా ఉంది. బెడ్ రూమ్, అటాచ్డ్ బాత్‌రూమ్ బస్సులో ఏర్పాటు చేశారు..మొత్తం 9మంది కూర్చునే డైనింగ్ కమ్ మీటింగ్ హాల్ ఉంటుంది. వైఫై, ఇంటర్నెట్, కంప్యూటర్, ఫ్యాక్స్, ప్లాస్మా టీవీ, డిష్ యాంటినా వంటి అధునాతన సాంకేతిక హంగులన్నీ ఉన్నాయి. ఎటువంటి రోడ్లపైనైనా ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేలా దీన్ని తీర్చిదిద్దారు..
« PREV
NEXT »

No comments

Post a Comment