తాజా వార్తలు

Saturday, 22 August 2015

సన్నికి సెన్సార్ బోర్డు షాక్


అందాల ఆరబోత శృతిమించి ఉన్నాయని సన్నిలియోన్  నటించిన మస్తిజాదే సినిమాకు సెన్సార్ బోర్డు నో చెప్పారు. ఇప్పటి వరకు సన్నీలియోన్  బాలీవుడ్‌లో చేసిన సినిమాలకు సెన్సార్ వాళ్లు అడ్డు చెప్పలేదు. ఎందుకంటే అలాంటి సన్నివేశాలు ప్రతి బాలీవుడ్ చిత్రంలోనూ కామనైపోయాయి సెన్సార్ సభ్యులు కూడా చూసి చూడన్నట్టు వదిలేస్తున్నారు. కానీ సెన్సార్ వాళ్లు కూడా మేము ఈ సినిమా చూడలేం బాబోయ్ అని చేతులెత్తేశారు. దాదాపు 36 ఏళ్ల తర్వాత సెన్సారింగ్‌లో ఉన్న మూడు స్థాయిల్లోనూ తిరస్కరణకు గురైన సినిమా ఇదేనని బాలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు. మిలాప్ జవేరి దర్శకత్వంలో సన్నీలియోన్ నటించిన చిత్రం ‘మస్తిజాదే’. ఈ సినిమా ట్రైలర్ చూసి షాకైన సెన్సార్ సభ్యులు ఇక సినిమా కూడా చూసి వామ్మో అనేశారు. ఇక చేసేది లేక చిత్ర నిర్మాతలు రివైజింగ్ కమిటీని ఆశ్రయించారు. వాళ్లు కూడా సినిమా చూసి నోరెళ్లబెట్టారు. ఇక ఏం చేయాలో తోచక ట్రిబ్యునల్‌ను ఆశ్ర యించారు. ఏదో అనుకుని చూసిన ట్రిబ్యునల్ సభ్యులు అందులో సన్నివేశాలు చూసి విస్తుపోయారట. దీంట్లో చాలా అభ్యంతరకరమైన సన్నివేశాలు ఉన్నాయని, ఒకవేళ ఎ సర్టిఫికెట్ ఇద్దామన్నా, ఆ లెవెల్‌ను ఎప్పుడో ఈ సినిమా దాటిపోయిందని తిరస్కరించారు.
« PREV
NEXT »

No comments

Post a Comment