తాజా వార్తలు

Saturday, 22 August 2015

‘టెర్రర్’ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి


శ్రీకాంత్, నిఖిత హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న ‘టెర్రర్’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధం అవుతోంది. అఖండ భారత్ క్రియేషన్స్ పతాకంపై షేక్ కరీమా సమర్పణలో ఈ సినిమా వస్తోంది. సతీష్ కాసెట్టి టెర్రర్ సినిమాకు దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమాను నిర్మాత షేక్ మస్తాన్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత షేక్ మస్తాన్ టెర్రర్ సినిమా విశేషాలను మీడియాకు వివరించారు. ‘శ్రీకాంత్ ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్-గా తెరకెక్కిన ఈ చిత్రం ఆద్యంతం అందరికీ ఉత్కంఠ కలిగిస్తుంది. ప్రతీ సీన్-ని మా దర్శకుడు సతీష్ కాసెట్టి అత్యద్భుతంగా తెరకెక్కించారు. శ్రీకాంత్ కెరియర్-లో బిగ్గెస్ట్ హిట్ చిత్రమే కాకుండా మా సంస్థకు మంచి పేరు తెచ్చే విధంగా ఈ చిత్రం రూపొందింది. ప్రతి సీన్-నీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయి. అతి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నాం’ అన్నారు. శ్రీకాంత్, నిఖిత, కోట శ్రీనివాసరావు, నాజర్, పృథ్వీ, వినయర్ వర్మ, ఉత్తేజ్, రవివర్మ, విజయ్ చందర్, సుధ, ముజ్-తబ జిఫర్, సంజయ్ రాయ్-చూర్ తదితరులు ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్ర సమర్పణ షేక్ కరీమా, మాటలు లక్ష్మీ భూపాల్, ఎడిటర్ బసవ పైడిరెడ్డి, ఆర్ట్ మురళి కొండేటి, ఫైట్స్ రన్ జాఘవా, సినిమాటోగ్రఫీ వాసిలి శ్యామ్-ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్ షేక్ జైనులాబ్దీన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ హరి అయినీడి, నిర్మాత షేక్ మస్తాన్, కథ, స్క్రీన్-ప్లే, దర్శకత్వం సతీష్ కాసెట్టి వ్యవహరిస్తున్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment