తాజా వార్తలు

Saturday, 22 August 2015

కమల్ హాసన్ చీకటి రాజ్యం సినిమా షూటింగ్ పూర్తికమల్ హాసన్, త్రిష కాంబినేషన్‌లో రాజ్‌కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్ పతాకంపై రాజేష్ ఎం.సెల్వని దర్శకునిగా పరిచయం చేస్తూ ఎస్.చంద్రహాసన్ నిర్మిస్తున్న చిత్రం ‘చీకటి రాజ్యం’. విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్, కిషోర్, సంపత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంలో కమల్ డిఫరెంట్ రోల్‌లో కనిపించబోతున్నారు. కేవలం 40 రోజుల్లోనే ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. ఈ సందర్భంగా కమల్ మాట్లాడుతూ..‘‘ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒక ఎత్తు. ఈ సినిమా మరొక ఎత్తు. నాలుగు విభిన్న పాత్రల చుట్టూ కథ తిరుగుతూ ఉంటుంది. ప్రేక్షకులు తమని తాము మర్చిపోయి సినిమాలో లీనమైపోతారు. గిబ్రాన్ మంచి సంగీతం అందించాడు’’అని తెలిపారు. దర్శకుడు రాజేష్ ఎం.సెల్వ మాట్లాడుతూ..‘‘ కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడితో సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా ఒక డిఫరెంట్ పాయింట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. గిబ్రాన్ వండర్‌ఫుల్ ఆడియో ఇచ్చారు. సాను జాన్ వర్గుపే ఫోటోగ్రఫి విజువల్ ఫీస్ట్‌లా ఉంటుంది. అలాగే అబ్బూరి రవి సున్నితమైన డైలాగ్స్ రాశారు. నా సినిమా కెరీర్‌కి మంచి బిగినింగ్ అవుతుంది’’ అని అన్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment