తాజా వార్తలు

Saturday, 22 August 2015

భయపెట్టనున్న నయనతార


నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘మయూరి’. తమిళంలో ‘మాయ’ పేరుతో రూపొందిన ఈ చిత్రానికి ఇది తెలుగు అనువాదం. అశ్విన్ శరవణన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రానికి సి.కె.ఎంటర్ టైన్ మెంట్ ప్రై.లి. పతాకంపై సి.కళ్యాణ్ అందిస్తున్నారు. ఏక కాలంలో ద్విభాషా చిత్రంగా ఈ సినిమా తయారయ్యిందనీ, టెక్నికల్ గా ఉన్నతస్థాయిలో రూపొందిన ఈచిత్రాన్ని తెలుగులో అందిస్తున్నందుకు ఆనందంగా ఉందని కళ్యాణ్ తెలిపారు. ఇది ఆద్యంతం ఊపిరిబిగపట్టించే సూపర్ నేచురల్ థ్రిల్లర్. ఓ పసిపాప తల్లిగా నయనతార ఈ చిత్రంలో కనిపిస్తుంది. కథ ఆమె కేరక్టర్ చుట్టూ తిరుగుతుంది. ఆమె కెరర్లోని బెస్ట్ ఫిలిమ్స్‌లో తప్పకుండా ఈ సినిమా ఉంటుంది. థ్రిల్లర్ కాబట్టి సహజంగానే ఇందులో మాటలకంటే దృశ్యానికే ఎక్కువ ప్రాధాన్యం. రీ రికార్డింగ్, విజువల్ ఎపెక్ట్స్ హైలెట్ అవుతాయి. వాటి కారణంగా ఈ సినిమాకు హాలీవుడ్ ఫిల్మ్ లుక్ వచ్చింది. రీ రికార్డింగ్ హంగేరీలో జరిపారు సంగీత దర్శకుడు రాన్ ఎథన్ యొహాన్. 24 ఏళ్ల ఓ కొత్త దర్శకుడితో నయనతార పని చేసిదంటే, ఈ సినిమా కథనం ఆమెను ఎంతగా ఆకట్టుకుందో అర్థమవుతుంది అన్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment