తాజా వార్తలు

Tuesday, 25 August 2015

సంతోషం అవార్డ్స్ వేడుకలో ‘పులి’ ట్రైలర్ విడుదలకత్తి’ చిత్రంతో తమిళనాడులో బాక్సాఫీస్‌ రికార్డుల్ని సృష్టించిన ఇళయదళపతి విజయ్‌ లేటెస్ట్ గా శింబుదేవన్‌ దర్శకత్వంలో ఎస్‌.కె.టి. స్టూడియోస్‌ పతాకంపై శిబు తమీన్స్‌,పి.టి.స్వెకుమార్‌ నిర్మిస్తోన్న చిత్రం పులి’. భారీ బడ్జెట్‌హై టెక్నికల్‌ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ చిత్రాన్ని తెలుగులో ఎస్.వి.ఆర్.మీడియా ప్రై.లి.బ్యానర్ పై సి.జె.శోభ విడుదల చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను ఆగస్ట్ 21న సంతోషం అవార్డ్స్ వేడుకలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ..
ఎస్.వి.ఆర్.మీడియా అధినేత్రి సి.జె.శోభ మాట్లాడుతూ ‘’మా బ్యానర్ లో గతంలో వచ్చిన చిత్రాలన్నింటినీ తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. ఇప్పుడు మా బ్యానర్ లో తమిళ స్టార్ హీరో విజయ్ నటిచింన పులి చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఈ సినిమా హై టెక్నికల్ వాల్యూస్ తో, దాదాపు 125 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. ఈ సినిమాలో విజయ్ సూపర్ హీరో పాత్రలో నటిస్తున్నారు. ఇదొక మైథలాజికల్ మూవీ. శృతిహాసన్, హన్సికలు హీరోయిన్స్ గా నటిస్తుండగా అలనాటి స్టార్ హీరోయిన్  శ్రీదేవి ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. చాలా కాలం తర్వాత శ్రీదేవిగారు చేసిన సినిమా ఇది. తెలుగులో ఈ చిత్రాన్ని మాకే ఇవ్వాలని విజయ్ పట్టుబట్టి హక్కులను మాకే ఇప్పించారు. అందుకు ఆయనకి స్పెషల్ థాంక్స్. తెలుగు, తమిళ భాషల్లో సినిమా సెప్టెంబర్ 17న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ లెవల్ లో విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ ను ఈరోజు అంటే ఆగస్ట్ 21న సంతోషం అవార్డ్స్ వేడుకలో భాగంగా ట్రైలర్ ను విడుదల చేస్తున్నాం.తమిళంలో దేవిశ్రీ అందించిన ఆడియో పెద్ద సక్సెస్ అయింది. అలాగే తెలుగులో ఆడియో విడుదలను ఈ నెలాఖరున ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment