తాజా వార్తలు

Saturday, 22 August 2015

తలనొప్పికి చెక్


నిద్రలేమి, ఆహారం, మానసిక ఒత్తిడితోనే తలనొప్పి ఏర్పడుతుంది. మనం తీసుకునే ఆహారంలోనూ తలనొప్పి కారకాలుంటాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాఫీలోని కెఫిన్, బటర్‌లోని టైరమైన్, అరటి పండ్లు, ఆరెంజ్, లెమన్‌లోని సిట్రస్ తలనొప్పిని రేకెత్తిస్తుంది. తలనొప్పిని దూరం చేసుకోవాలంటే.. ఆహారంలో మార్పులు చేయాలి. డైట్‌లో కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా చేర్చుకోవాలి.
చీజ్. చాక్లెట్, మటన్ తీసుకోకూడదు. వీటికి బదులుగా విటమిన్ డి, విటమిన్ సి, క్యాల్షియం, బీ 12 వంటివి దాగివున్న ఆహార పదార్థాలను తీసుకోవాలి. క్యాబేజీ, క్యాలీఫ్లవర్, మెంతికూర తీసుకోవాలి. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, మసాలా ఫుడ్ అసలొద్దు. ఎంఎస్‌జీ కలిగిన అజినోమోటో వంటివి కూడా తలనొప్పికి కారణాలవుతాయి. పోషకాలతో కూడిన ఆహారం, మంచి నిద్ర, మితమైన వ్యాయామం వంటివి తలనొప్పిని దూరం చేస్తాయి.
* సాల్ట్ ఉప్పు కాకుండా రాళ్ల ఉప్పును కాసింత చేర్చిన పాలను తీసుకోవడం ద్వారా తలనొప్పి నయం అవుతుంది.
* ఒక గ్లాసుడు వేడి నీటిలో నిమ్మరసం చేర్చి తీసుకోవచ్చు.
* యూకలిప్టస్ తైలం బాగా పనిచేస్తుంది.
* గోరువెచ్చని ఆవు పాలు తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. తలనొప్పిగా ఉంటే ఆహారంలో కాస్త నెయ్యి చేర్చుకుంటే బెటర్
* మసాలా దినుసుల్లో దాల్చిన చెక్కను పేస్ట్‌లా నూరుకుని నుదుటికి రాసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
* చందనంను పేస్ట్‌లా చేసుకుని నుదుటికి రాసినా ఫలితం ఉంటుంది.
* కొబ్బరి నూనెను నుదుట రాసుకుని 15 నుంచి 20 నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే తలనొప్పి పరార్ అవుతుంది. కొబ్బరి నూనె వేడిని తగ్గిస్తుంది.
* నీరు, వెల్లుల్లిని రుబ్బుకున్న ఆ రసాన్ని ఒక స్పూన్ తీసుకుంటే తలనొప్పిని నయం చేసుకోవచ్చు.
* పరగడున ఒక ఆపిల్ ముక్కను కట్ చేసి అందులో లైట్‌గా ఉప్పు రాసి తీసుకుంటే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఆపిల్‌ను మాత్రం తీసుకున్నా గోరువెచ్చని పాలు లేదా నీళ్లు తీసుకోవాలి. ఇలా పది రోజులు చేస్తే తలనొప్పంటూ ఉండదు.
* తలనొప్పిని దూరం చేసే గుణం బాదం నూనెను ఉంది. అందుచేత నుదుట బాదం నూనె రాసుకుని 15 నిమిషాల పాటు మసాజ్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. తమలపాకుల్ని తీసుకుని పేస్ట్‌లా రుబ్బుకుని నుదుటిపై రాసుకుంటే తలనొప్పి తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.

« PREV
NEXT »

No comments

Post a Comment