తాజా వార్తలు

Tuesday, 25 August 2015

'లచ్చిందేవికి ఓ లెక్కుంది' చిత్రం బ్యానర్ లోగో, టైటిల్ మరియు ఫస్ట్ లుక్ లాంచ్నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి జంటగా మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై జగదీశ్ తలశిల దర్శకత్వంలో సాయి ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న చిత్రం 'లచ్చిందేవికి ఓ లెక్కుంది'. ఈ చిత్రం బ్యానర్ లోగో, టైటిల్ మరియు ఫస్ట్ లుక్ లాంచ్ ఆదివారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సందర్భంగా..ఎమ్.ఎమ్.కీరవాణి మాట్లాడుతూ "జగదీశ్ మా కుటుంబలో వ్యక్తి లాంటివాడు. మంచి టెక్నీషియన్. ఈ సినిమాలో మొత్తం ఐదు పాటలున్నాయి. 'అందాల రాక్షసి' జంట మళ్ళీ ఈ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. నా ఫేవరేట్ యాక్టర్ జె.పి గారు ఈ చిత్రంలో ఫుల్ లెంగ్థ్ రోల్ లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ముఖ్యమైన సూత్రదారి, పాత్రదారి డబ్బే. సినిమా అంతా చాలా ఎంటర్టైనింగ్ గా నడుస్తుంది" అని చెప్పారు.
దర్శకుడు జగదీశ్ మాట్లాడుతూ "ఇదొక కామెడీ ఎంటర్టైనింగ్ చిత్రం. ప్రతి ఒక్కరికి ఓ లెక్కుంటుంది అలానే లచ్చిందేవికీ ఓ లెక్కుంది అనే కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని రూపొందించాం. నాకు దర్శకునిగా అవకాశం ఇచ్చిన ప్రసాద్ గారికి నా కృతజ్ఞతలు" అని చెప్పారు.
నవీన్ చంద్ర మాట్లాడుతూ "కీరవాణి గారితో కలిసి పని చేయడం చాలా సంతోషంగా ఉంది. జగదీశ్ గారు టాలెంటెడ్ డైరెక్టర్. అందాలా రాక్షసి తరువాత లావణ్య తో మరలా కలిసి నటిస్తున్నాను" అని చెప్పారు.
సాయి ప్రసాద్ మాట్లాడుతూ "ఈ సంవత్సరంలో రిలీజ్ అయిన చిత్రాల్లో మా సినిమా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాగా నిలుస్తుంది" అని చెప్పారు.
ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, పాటలు: శివశక్తి దత్తా, అనంత శ్రీరాం, ఎడిటర్:కోటగిరి వెంకటేశ్వరావు, నిర్మాత: సాయి ప్రసాద్ కామినేని, రచన-దర్శకత్వం: జగదీశ్ తలశిల. 
« PREV
NEXT »

No comments

Post a Comment