తాజా వార్తలు

Saturday, 22 August 2015

బరువును తగ్గించుకోండి ఇలా…


బరువును తగ్గించుకోండి ఇలా…
అనారోగ్యకర ఆహారాన్ని తొలగించండి.

తయారుగా ఉన్న ఆహారాన్ని చూడగానే మనం ఆకర్షితులం అవుతాము. కానీ, బరువు తగ్గి స్లిమ్ గా కనపడాలి అనుకునే వారు, అనారోగ్యకర ఆహార పదార్థాలను తీసివేయాలి. అన్ని రకాల స్నాక్స్ మరియు బిస్కెట్ సంబంధిత ఆహారాలను తీసివేయండి. బరువు తగ్గాలి అనుకునే వారు ముందుగానే మీ భోజనం టేబుల్ పై ఉన్న బరువు పెంచే వాటిని తొలగించుకోండి.

ఫ్రూట్ బౌల్ ను కొనుగోలు చేయండి

పండ్ల గిన్నె లేని వారు, దానిని కొనుగోలు చేయండి. మీ కళ్ళ ముందు పండ్లు మరియు కూరగాయలను ఉంచుకోండి. ఆపిల్, నారింజపండ్లు మరియు అరటిపండ్లను ఉంచుకోండి ఆకలిగా అనిపించినపుడు ఫ్రై చేసిన ఆహారాల కన్నా వీటిని తింటం ఆరోగ్యానికి మంచిది మరియు బరువు తగ్గుటలో ఇవి మంచి పాత్ర పోషిస్తాయి.

వంటగదిలో తినండి

టి.వి ముందు కూర్చోని తినటం వలన మీకు తెలీకుండానే అధికంగా తినే అవకాశాలు ఉన్నాయి. కావున, వంట గదిలో తినటం వలన ఎంత తింటున్నారో మరియు మరెంత తినాలో అవగాహన కలిగి ఉంటారు.

ప్రణాళిక

స్నాక్స్ తినకుండా ఎంత వరకు ఉంటున్నారో అది మాత్రమేకాదు. పండ్లు మరియు కూరగాయలను ముందుగానే కత్తిరించుకోని రెడీగా పెట్టుకోండి. భోజనాల మధ్యలో ఆకలిగా అనిపించినపుడు నేరుగా వీటిని తినే వీలుంటుంది. కావున బరువు తగ్గలి అనుకునే వారు ఇలా ముందు నుండే ప్రణాలిక రూపొందించుకొని ఉండాలి.

ప్లేటు పరిమాణం

మనం ఎంత తింటున్నామో మరియు ఎంత తినాలి అనేది మన ముందు ఉన్న ప్లేట్, దానిలో ఉండే ఆహారం పైన కూడా ఆధారపడి ఉంటుంది. బరువు తగ్గాలి అనుకునే వారు తక్కువ స్థాయిలో మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. ఏదిఏమైనప్పటికీ మీరు రోజు తినే ఆహారం యొక్క ప్లేట్ పరిమాణాన్ని తగ్గించండి. పెద్దగా ఉన్న ప్లేట్ లో తినటం వలన తినే ఆహారంపై నియంత్రణ కోల్పోయే అవకశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఆరోగ్యకర ఆహారం

వంటింట్లో ఉండే ఫ్రిజ్ లో అనారోగ్యకర ఆహార పదార్థాలను తొలగించి, ఆరోగ్యకర ఆహార పదార్థాలతో నింపండి. దీని వలన అనారోగ్యకర ఆహారాలకు దూరంగా ఉండేలా కొంచెమైన నియంత్రణ పొందుతారు. శరీర బరువు తగ్గాలి అనుకునే వారు ఆహారం పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కావున, ఇలా బరువు తగ్గించే విధంగా మీ వంటగదిని తయారు చేసుకొని, వారం రోజుల్లో కలిగే వ్యత్యాసాలను మీరే గమనించవచ్చు.
« PREV
NEXT »

No comments

Post a Comment