తాజా వార్తలు

Saturday, 22 August 2015

కన్యాశూల్కం పేర కన్నె పిల్లనమ్మె రోజులలో,


కన్యాశూల్కం పేర కన్నె పిల్లనమ్మె రోజులలో,

కనులాకింపు చేయకన్నె పెళ్లి కొడుకు కరువాయే,

కన్నెపిల్ల కన్ను కప్పి కట్టపెట్టె ముత్తాతకి,

ముసలి మొగుని కట్టుకొని, ముతక చీర చుట్టుకొని,

మురిపెంగ మాట్లాడగ మనిషి తోడు కరువైతే,

మదిలోని మాటను యెద మీద తాళిని,

మార్చి మార్చి చూసిన మగడే ముఖ్యమాయనె….

——–లక్ష్మీ ప్రియాంక పులవర్తి

« PREV
NEXT »

No comments

Post a Comment