తాజా వార్తలు

Saturday, 22 August 2015

మొలకెత్తే గింజలు అన్నింటికీ మేలు..


బరువు తగ్గడానికి మొలకెత్తిన గింజలు ఎంతో మంచివని పరిశోధనలు చెబుతున్నాయి. మొలకలలో పీచు ఎక్కువ స్థాయిలో ఉండి, క్యాలరీలు తక్కువగా ఉన్నందున బరువు తగ్గించుకొనే ప్రణాళికకు ఎంతో సహాయకారిగా ఉంటాయి. మొలకలను తినడం వలన ఎక్కువ క్యాలరీలను పొందకుండానే పోషకాలను పొందవచ్చు. మీరు బరువు తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుంటే మాత్రం మీ ఆహార ప్రణాళికలో మొలకలను జోడించండి. మొలకలు ఆరోగ్యానికి మంచివే కాక అవి ఎంతో రుచికరమైనవి కూడా. మీ సలాడ్లకు, సూప్ లకు, మాంసపు వంటకాలకు, పాస్తాకు మరింత రుచిని జోడించి మీకు ఆకలిని పుట్టిస్తాయి. అందువల్ల మీ రోజువారీ ఆహార ప్రణాళికలో మొలకలను జత చేయండి. మొలకల్లో కొవ్వు వుండదు. ప్రోటీన్లకు మొలకలు పెట్టింది పేరు. సెనగలు, పెసలు, సోయా, రాజ్‌మా, బఠానీ ఇవన్నీ మొలకలు తయారు చేసుకోవడానికి మార్గాలే! గర్భిణులు మొలకలు తింటే వారికే కాదు, పుట్టే బిడ్డకూ ఆరోగ్యం. మొలకలు జీర్ణమవడానికి పట్టే సమయం తక్కువ. యాంటీ ఆక్సిడెంట్లు మొలకల్లో అధికం. ఫైబర్‌, ఐరన్‌, నియాసిన్‌, కేల్షియమ్‌ -ఇవన్నీ మొలకల్లో పుష్కలం. అందుకే మొలకలు తీసుకొండి సన్నబడండి.

« PREV
NEXT »

No comments

Post a Comment