తాజా వార్తలు

Tuesday, 25 August 2015

మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ ఆడియో విడుదల
మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ హీరోగా గ్లామరస్‌ రెజీనా హీరోయిన్‌గా శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై హరీష్‌శంకర్‌.ఎస్‌ దర్శకత్వంలో హిట్‌ చిత్రాల నిర్మాత దిల్‌రాజు నిర్మిస్తోన్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’. మిక్కి జె.మేయర్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం ఆగస్ట్ 23, ఆదివారం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది.
ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, సాయిధరమ్ తేజ్, దిల్ రాజు, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్, డైరెక్టర్ హరీష్ శంకర్.ఎస్, అనిల్ రావిపూడి, నరేష్, సి.రాంప్రసాద్, ప్రగతి, ఎ.యస్.రవికుమార్ చౌదరి, కె.ఎస్.రవీంద్ర(బాబీ), వనమాలి, నవదీప్, భాస్కరభట్ల, చంద్రబోస్, బండ్ల గణేష్, వంశీ పైడిపల్లి, డి.వి.వి.దానయ్య, మిక్కి జె.మేయర్, గౌతంరాజు, కోటి తదితరులు పాల్గొన్నారు.
ఆడియో సీడీలను మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించి సుబ్రమణ్యం ఫర్ సేల్ టీమ్ నిర్మాత దిల్ రాజు, హరీష్ శంకర్.ఎస్, సాయిధరమ్ తేజ్, రెజీనాకి అందించారు.
వంశీ పైడిపల్లి థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు.
ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదలైంది.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘’గత నాలుగైదు రోజులుగా  అభిమానుల సమక్షంలో వేడుకలు జరుపుకుంటూనే ఉన్నాను. ఇటీవల ఇంటర్వ్యూలో నేను సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యానని భావిస్తున్నారా అనే ప్రశ్న వేశారు. నేను 8 సంవత్సరాలుగా సినిమాల్లో నటించకపోయుండవచ్చు కానీ పవన్, చరణ్, బన్ని, సాయి, వరుణ్ తేజ్ రూపాన సినిమా రంగంతో దూరం కాలేదు. ఎప్పుడైనా షూటింగ్ లకు వెళ్లినప్పుడు అక్కడ వాతావరణాన్ని చూసి ఇదే కదా నా సామ్రాజ్యం అనే ఉద్విగ్నతకు లోనౌతుంటాను. ఈ రోజు ఈ ఫంక్షన్ కి రాకపోయుంటే బాధపడేవాడ్నేమో. నన్ను ముందుకు నడిపే ఇంధనాన్ని అభిమానులే నాకు అందిస్తున్నారు. సుబ్రమణ్యం ఫర్ సేల్  ఈ టైటిల్ వినగానే ఎక్కడో నా సినిమాలు నాకు గుర్తుకు వచ్చాయి. చూచాయగా విన్నప్పుడు మొగుడు కావాలి సినిమా కథలా అనిపించింది. అలాంటి కథే అయితే ఎక్సలెంట్ ఎంటర్ టైనర్ మూవీ అవుతుంది. అలాగే బావగారూ బాగున్నారా..సినిమా గుర్తుకు వచ్చింది. ఇలాంటి ఎంటర్ టైనింగ్ కాన్సెప్ట్ తో రూపొందిన సుబ్రమణ్యం ఫర్ సేల్అభిమానులను ప్రేక్షకులను అలరిస్తుంది. మంచి కథను ఎంచుకున్న దిల్ రాజు అండ్ టీమ్ ను అభినందిస్తున్నాను. ఇంతకు ముందు దిల్ రాజు నాతో సినిమా చేయాలనుందని అడిగేవాడు. తను అడగకుండా ఉండుంటే నేనే సినిమా చేయాలనుందని అడిగేవాడిని. నాలుగు సంవత్సరాలు151,152,153..సినిమాలు చేయాలనుకుంటే దిల్ రాజులాంటి ప్రొడ్యూసర్ ఉండాలి. తనతో సినిమా చేయాలని అడగాలనుకున్నాను. నేను ఆయన్ను కూడా నాతో సినిమా చేయమని అడుగుతున్నాను. విజయా సంస్థ, జగపతి సంస్థ, సురేష్ ప్రొడక్షన్స్, అశ్వనీదత్ గారి వైజయంతీ మూవీస్, అల్లు అరవింద్ గీతాఆర్ట్స్ వంటి సంస్థలనే ఇప్పటికీ చెప్పుకుంటున్నామంటే కారణం దర్శకులే కాదు అన్నీ తల్లీలా చూసుకునే నిర్మాతలు కూడా కారణం. ఈరోజు దిల్ రాజు సంస్థ కూడా ఆ స్థాయిలో ఉందంటే కారణం ఆయన శ్రమే కారణం. అప్పటి నిర్మాణ సంస్థలకు ధీటుగా ఇప్పుడు ఆయన సినిమాలు చేస్తున్నారు. ఒకరిని తక్కువ చేయడం కాదు, నా మనసులో ఆయన గురించి ఉన్నదీ, నేను అబ్వర్జ్ చేసింది చూసి చెబుతున్నాను. కథను ఎన్నుకోవడమే కాకుండా దాన్ని సక్రమంగా తెరకెక్కించడంలో ఇన్ వాల్వ్ అవుతున్నారు. గతంలో అల్లుఅరవింద్ గారు, త్రివిక్రమ్ రావుగారు, అశ్వనీదత్ గారు, దేవిప్రసాద్ గారు కూడా సినిమా నిర్మాణంలో బాగా ఇన్ వాల్వ్ అయ్యేవారు. అందరూ కలిసి టీమ్ వర్క్ చేసేవారు. దిల్ రాజు వంటి నిర్మాత అందరికీ ఇన్ స్పిరేషన్ గా నిలుస్తున్నారు. ఫెయిల్యూర్ ను ఎవరి మీదనో తోసేయకుండా తన తప్పును ఒప్పుకోవడం కూడా తన గొప్పతనం. ఆయనలాంటి నిర్మాత సాయికి దొరకడం తన అదృష్టం. ఈ సినిమా కచ్చితంగా డెఫనెట్ హిట్ అవుతుంది. హరీష్ శంకర్ గురించి చెప్పాలంటే గబ్బర్ సింగ్ చూసినప్పుడు నాలోని నటుడు ఇలాంటి సినిమా కదా నాకు కావాల్సింది. ఇలాంటి డైరెక్టర్ కదా నాకు దొరకాలి అనుకున్నాడు. దొరికుంటే చించేసేవాడిని కదా అనుకున్నాను. గబ్బర్ సింగ్  సినిమాకి పెద్ద అభిమానిని. ప్రతి ఫ్రేమ్ లో ఎంటర్ టైన్ మిస్ కాకుండా ఉంటుంది. నేను హిందీ సినిమా చూశాను. కానీ దానికంటే తెలుగులోనే బావుంది. అదంతా హరీష్ శంకర్ తీసుకున్న కేర్. అలాంటి దర్శకుడు నాకు కావాలి. 150 సినిమాకి డైరెక్టర్ ఫ్రీజ్ కాలేదు. ఎవరు మంచి కథతో వస్తారో, ఇస్తారో .. ప్రేక్షకులు, అభిమానులు సంతోషపడేలా మంచి కథ అవసరమని సభాముఖంగా ఇక్కడ ఉన్న హరీష్ శంకర్ ను, వంశీ పైడిపల్లిని అడుగుతున్నాను. ప్రతి యంగ్ డైరెక్టర్ ని నేను తయారుగా ఉన్నాను. మీరు తయారు చేసుకని రండని అడుగుతున్నాను. సాయి కష్టపడతాడని తెలుసు. ఈ సినిమా మంచి ఎంటర్ టైనర్ అవుతుంది. రాజ్-కోటి కంపోజ్ చేసిన నా ఫేవరేట్ సాంగ్ గువ్వా గోరింక పాట వినగానే చాలా ఆశ్చర్యపోయాను. నేను కూడా లోలోపల స్టెప్ట్స్ వేశాను. ప్రతి పాటలను బాగా కంపోజ్ చేసిన మిక్కిని అభినందిస్తున్నాను. ఈ సినిమాని మెలోడీగానే కాకుండా బీట్ కూడా యాడ్ చేసి ఎక్సలెంట్ మ్యూజిక్ అందించాడు. రాంప్రసాద్ సినిమాటోగ్రఫీ బావుంది. గౌతంరాజుగారు ఎడిటర్ గా చేస్తున్నారు. ఏ కోశాన సందేహం అవసరం లేదు. కచ్చితంగా విజయం సాధిస్తుందని నమ్మకం ఉంది. రెజీనా స్టూడెంట్ ఫీలై ప్రతి విషయాన్ని నేర్చుకుంటున్నది. రామ్ చరణ్ తర్వాత సాయిధరమ్ తేజ్ నాకు మరో బిడ్డ. నా ఒళ్లో పెరిగినందుకు మేకప్ వాసన వంటపట్టిందేమో, సినిమాల్లోకి ఎంటర్ అయ్యాడు. సినిమాల్లో రావడం ఒక ఎత్తయితే ఎదగాలంటే మాత్రం స్వయం కృషి అవసరం. ఇంటిపేరు చెప్పుకోకుండా కష్టపడుతున్నాడని తెలిసి ఆనందపడ్డాను. భవిష్యత్ లో పెద్ద హీరో అవుతాడు. అభిమానులు ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని భావిస్తున్నాను. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్. సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలి’’ అన్నారు.
హీరో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ‘’ చిరంజీవిగారి 150 వ సినిమాలో చిన్న రోల్ చేయాలనే కోరిక ఉంది. నాకు నటుడిగా జన్మనిచ్చింది వైవియస్ చౌదరి అయితే నటుడిగా చేయి పట్టుకుని దిల్ రాజుగారు నడిపిస్తున్నారు. నేను ఈ సంస్థలో ఒక సినిమా చేయాలనుకున్నాను. కానీ ఏకంగా మూడో సినిమా చేసేస్తున్నాను. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో మళ్లీ మళ్లీ పనిచేయాలని ఉంది. హరీష్ గారు నన్ను చూసి ఈ సినిమాకి ఎంచుకున్నందుకు ఆయనకి థాంక్స్. కథ వినగానే నేను చేయగలుగుతానా అనుకున్నాను. కానీ ప్రతి సీన్ ను నన్ను ముందుండి నడిపించారు. ఈ సినిమానే కాదు, ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా. మిక్కి, రెడ్ బుల్ ఎనర్జీ అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. రాంప్రసాద్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణగారికి, గౌతంరాజుగారికి  అందరికీ థాంక్స్. ప్రతి ఒక్కరినీ ఫ్యామిలీగా ఫీలయ్యాను. హర్షిత్ కి ఆల్ ది బెస్ట్. రెజీనాతో రెండో సినిమా. తనతో పనిచేయడం హ్యపీ. తను చాలా డేడికేటివ్. తన నుండి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. నాకు ఒక కన్ను పవన్ కళ్యాణ్ గారైతే, మరో కన్ను నాగబాబుగారైతే చూపు మెగాస్టార్ చిరంజీవిగారు. మెగాభిమానులు గర్వపడేలా కష్టపడి మంచి సినిమాలు చేయడానికి ప్రయత్నిస్తాను’’ అన్నారు.
చిత్ర దర్శకుడు హరీష్ శంకర్.ఎస్ మాట్లాడుతూ ‘’చిరంజీవిగారు ఈ ఫంక్షన్ కి రావడం ఆనందంగా ఉంది. ఖుషీ సినిమాలో కళ్యాణ్ గారు భూమికను నీకెవరంటే ఇష్టం అని అడిగినప్పుడు చిరంజీవంటే ఇష్టమని చెబుతుంది. థియేటర్ ఫ్యాన్స్ గోలతో మాకు నెక్స్ ట్ డైలాగ్ అర్థం కాలేదు. అమ్మ, నాన్న, చిరంజీవి ఎప్పటికీ బోర్ కొట్టరని, కామన్ గా తెలుగువారికి ఇష్టమని  పవన్ చెబతారు. గత దశాబ్దాలుగా అమ్మ,నాన్న, చిరంజీవిగారిని మేం గుండెల్లో పెట్టుకున్నాం. ఇది నిజం. ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలో ఒక సాంగ్ ను రీమిక్స్ చేయాలని అనుకున్నాం. కానీ  ఏసాంగ్ ని రీమిక్స్ చేయాలో అర్థం కాలేదు. చివరికి ఆలోచించి ఫైనల్ గా గువ్వా, గోరింకతో..సాంగ్ ను రీమిక్స్ చేయాలని అనుకున్నాం. సాయిని చిరంజీవిగారిలా, కళ్యాణ్ గారిలా చూపించాలని కొత్తగా ప్రయత్నాలు చేయలేదు. తను అలాగే ఉన్నాడు. సుబ్రమణ్యం ఫర్ సేల్ కథ అనుకోగానే కొత్త ఎనర్జీ ఉన్న స్టార్ కావాలనుకునే సమయంలో తేజ్ ఐడియాకి వచ్చాడు. తను ఈ కథకు ఫుల్ ఎనర్జీని ఇచ్చాడు. ఈ సినిమా ద్వారా ఒక హీరో తమ్ముడుయ్యాడు. రెజీనా హార్డ్ వర్కర్. తేజ్ కి మేనమామ పోలికలే కాదు, కష్టపడే గుణాలు కూడా తననేదో స్టార్ చేద్దామని కాకుండా తను స్టార్ అని తెలిసే స్వార్ధంగా తనతో సినిమా చేస్తున్నాను. దిల్ రాజుగారు, శిరీష్, లక్ష్మణ్ గారితో చేసిన రామయ్యా వస్తావయ్యా అనుకున్నంత సక్సెస్ కాలేదు. అయినా వారు ఎప్పుడూ కలిసినా మంచి సినిమా చేయాలని ఎంకరేజ్ చేశారు. అందుకు వారికి థాంక్స్. మిక్కి నేను అనుకున్న దానికంటే ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. రాంప్రసాద్ గారికి, గౌతంరాజుగారు సహా మిగతా నటీనటులు, టెక్నిషియన్స్ కి థాంక్స్’’ అన్నారు.
నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ‘’మా బ్యానర్ పెట్టి 14 సంవత్సరాలు అయింది. 18 సినిమాల్లో 15 సినిమాలు హిట్ అయ్యాయి. చిరంజీవిగారి గురించి ఈరోజు మాట్లాడాలి. ఇక్కడొక విషయం చెప్పాలి. చిరంజీవిగారు సాధారణంగానే మెగాస్టార్ అయిపోలేదు. 149 సినిమాల్లో ప్రతి ఒక కథ విని ఎంచుకున్న విధానమే అందుకు కారణం. చిరంజీవిగారి సినిమాని ఇప్పటి వరకు నైజాంలో రిలీజ్ చేయలేదు. మేం డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేసేసరికి ఆయన సినిమాల నుండి గ్యాప్ తీసుకున్నారు. ఇప్పుడు ఆయన 150వ సినిమా రాబోతుంది. అందుకు ముందుగానే చరణ్ కి బ్లాంక్ చెక్ ఆఫర్ ఇచ్చాను. ఆయన సినిమాని రిలీజ్ చేసే అవకాశం వస్తే చాలు. ఇక పవన్ కళ్యాణ్ గారి తొలిప్రేమ సినిమాని నైజాంలో రిలీజ్ చేస్తున్నప్పుడు ఆయన్ను కలిసేవాడిని. నేను నిర్మాతనైతే పవన్ గారితో సినిమా చేయాలనే కోరిక ఉండేది. 15 సంవత్సరాలుగా ఆ కోరిక తీరనేలేదు. ఈ సంవత్సరం మా లక్ బావుంది. 15 రోజుల క్రితమే పవన్ కళ్యాణ్ గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏ డైరెక్టర్ తో చేయబోతున్నామో తెలియలేదు. కచ్చితంగా మెగాభిమానులు కోరకునే విధంగా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా చేస్తాం. చిరంజీవిగారితో కూడా అవకాశం ఉంటే సినిమా చేస్తాను. కుదిరితే చిరంజీవిగారు, పవన్ గారిని కలిపి సినిమా చేసేస్తాం. హరీష్ టాలెంట్ పై నమ్మకం ఉంది. ఈసారి హరీష్ టాలెంట్, మా బ్యానర్ లో ప్యామిలీ సైడ్ ఉండే వాల్యూస్ తో సినిమా ఉంటుంది. పిల్లానువ్వులేని జీవితం తర్వాత సినిమా రిలీజ్ కాకముందే ఈ సినిమా స్టార్ట్ చేశాం. అలాగే ఈ సినిమా రిలీజ్ కాకముందే అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాం. ఈ నాలుగో సినిమాతోనే పవన్ కళ్యాణ్ ఎలాగైతే తొలిప్రేమతో ఎలాంటి స్టార్ డమ్ అందుకున్నారో అలాంటి స్టార్ డమ్ ను తేజు చేరుకుంటాడు. తేజుకి ఆల్ ది బెస్ట్. రెజీనా వెరీ గుడ్ ఫెర్ పార్మర్. తన చుట్టూనే ఈ కథంతా తిరుగుతుంది. మిక్కితో సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్త్తున్నాను. మంచి మ్యూజిక్ అందించారు. సెప్టెంబర్ 24న సినిమాని రిలీజ్ చేస్తున్నాం. టీమ్ అందరికీ థాంక్స్’’ అన్నారు.
వంశీ పైడిపల్లి మాట్లాడుతూ ‘’చిరంజీవిగారు మళ్లీ సినిమాల్లోకి వచ్చేయండి సార్..మేమంతా వెయిట్ చేస్తున్నాం. ఇక సినిమా గురించి చెప్పాలంటే నాది, హరీష్ జర్నీ ఒకేసారి స్టార్టయింది. హరీష్ లో పడి లేచే కసి ఉంటుంది. హరీష్ కింద పడితే అంతే వేగంగా పైకి లేస్తాడు. సినిమాల్లో సక్సెస్ కొట్టాలనే కసి, పట్టుదల మామూలుది కాదు. ఈ ట్రైలర్ లో చిటెకేసి..సీన్ చూస్తుంటే హరీష్ వస్తున్నాడో, తేజ్ వస్తున్నాడో అర్థం కాలేదు. మిరపకాయ్, గబ్బర్ సింగ్, ఇప్పుడు సుబ్రమణ్యం ఫర్ సేల్ తో మన ముందకు వస్తున్నాడు. తేజ్ నాకు బ్రదర్. తేజ్ లక్ ఉంది., రెస్పాన్సిబిలిటీ ఉంది. లక్ ఏంటంటే చిరంజీవిగారు, పవన్ గారిలా కనపడతాడు. రెస్పాన్సిబిలిటీ ఎంటంటే వారి ఆశయాలను ముందకు తీసుకెళ్లాలి. దిల్  రాజుగారి గురించి మాట్లాడాలంటే మా ఫ్యామిలీ గురించి మాట్లాడినట్టే. మిక్కికి, రాంప్రసాద్ కి మిగతా యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
రెజీనా మాట్లాడుతూ ‘’ చిరంజీవిగారు హీరోలకే కాదు, చాలా మంది హీరోయిన్స్ కి కూడా ఇన్ స్పిరేషన్. ఆయనే మాకు ఈ సినిమాకి ఇన్ స్పిరేషన్ గా నిలిచారు. సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమా గురించి చెప్పాలంటే హీరీష్ గారి గురించి చెప్పాలి. తన దగ్గర నుండి చాలా విషయాలను నేర్చుకున్నాను. యాక్టర్ నుండి బెస్ట్ ను బయటికి తీస్తారు. మిక్కి గారితో రొటీన్ లవ్ స్టోరి తర్వాత చేసిన మూవీ. చాలా కొత్తగా మ్యూజిక్ ఇచ్చాడు. సాయిధరమ్ తో పనిచేయడం హ్యపీగా ఉంది. నాతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరికీ, వారి అందించిన సపోర్ట్ కి థాంక్స్’’ అన్నారు.
రావురమేష్ మాట్లాడుతూ ‘’హరీష్ శంకర్ సూపర్ స్క్రిప్ట్ తో సినిమాని డైరెక్ట్ చేశాడు. సాయిధరమ్ తేజ్ ఎనర్జిటిక్ ఫెర్ పార్మెన్స్, సి.రాంప్రసాద్ కెమెరా వర్క్, మిక్కి జె.మేయర్ మ్యూజిక్ అన్నీ పక్కాగా కుదిరాయి. డైలాగ్స్ అందరినీ ఎంటర్ టైన్ చేసేలా ఉంటుంది. ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేశాను. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు.
ఎ.యస్.రవికుమార్ చౌదరి మాట్లాడుతూ ‘’సాయిధరమ్ తేజ్ నా హీరో, రెజీనా నా హీరోయిన్, దిల్ రాజు నా నిర్మాత. హరీష్ శంకర్ నా మిత్రుడు. మొత్తం మీద ఇది నా సినిమాలా ఫీలవుతున్నాను. తేజు పెద్ద స్టార్ గా ఎదుగుతాడు. హరీష్ ను షూటింగ్ టైమ్ లో కలిశాను. సినిమా పెద్ద హిట్టవుతుందని ఓ డైరెక్టర్ గా చెబుతున్నాను. తేజ్ పెద్ద ఇంకా పెద్ద స్టార్ గా ఎదుగుతాడు. అతనికి తన తల్లి విజయమ్మ ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి’’ అన్నారు.
యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ ‘’దిల్ రాజుగారు మా రాజుగారు. ఆయనతో ఒకసారి యాక్సెస్ అయ్యామంటే అందరూ ఆయనతో లవ్ లో పడిపోతారు. ఈ సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ రావాలి. తేజ్ కి ఈ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ కావాలి. హరీష్ శంకర్ గారి స్టామినా ఏంటో నాలుగేళ్ల క్రితం గబ్బర్ సింగ్ తో చూశాం. ఆయనకి కూడా ఈ సినిమా పెద్ద సక్సెస్ తేవాలి. మిక్కికి, రాంప్రసాద్ గారికి టీమ్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
వనమాలి మాట్లాడుతూ ‘’మెలోడి సాంగ్స్ ఎన్నింటినో రాశాను. అయితే ఈ సినిమాలో భిన్నమైన ఫ్లెవర్స్ తో పాటలు రాశాను. దిల్ రాజుగారి సినిమాలో పాటలు రాయడం హ్యపీగా ఉంది. హరీష్ శంకర్ గారి స్టయిల్ లో పాటలుంటాయి. మిక్కిగారితో మరోసారి కలిసి చేస్తున్న సినిమా ఇది. ఆడియో పెద్ద హిట్ కావాలి. సాయిధరమ్ తేజ్ కి పెద్ద హిట్ మూవీగా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ మిక్కి జె.మేయర్ మాట్లాడుతూ ‘’హరీష్ శంకర్ లోని ఎనర్జీయే ఈ సినిమా ఆడియో బాగా రావడానికి కారణం. దిల్ రాజుగారికి థాంక్స్. వనమాలి, భాస్కరభట్ల, చంద్రబోస్ గారు మంచి లిరిక్స్ అందించారు. సాయిధరమ్ తేజ్ డ్యాన్స్ అంటే చాలా ఇష్టం. తెలుగంటే...అనే పాట ఈ ఆల్బమ్ లో నాకు బాగా ఇష్టం’’ అన్నారు.
కె.ఎస్.రవీంద్ర(బాబీ) మాట్లాడుతూ ‘’హరీష్ శంకర్ ను బ్రదర్ అని పిలుస్తుంటాను. ఒక ఫ్యాన్ గా గబ్బర్ సింగ్ ను 50,60 సార్లు చూశాను. ఆయన పవన్ ను పిచ్చిగా ప్రేమిస్తాడు. అభిమానిగా గబ్బర్ సింగ్ సినిమా తీశాడు. ఏ ముహుర్తాన పవర్ అనే టైటిల్ పెట్టానో నా జీవితంలో పవర్ స్టార్ గారు వచ్చారు. ఇప్పుడు ఆయనతోనే సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా చేస్తున్నాను. గతంలో దిల్ రాజుగారి బ్యానర్ లో రైటర్ గా చేశాను. రెజీనా నా హీరోయిన్ నాతో పవర్ సినిమాలో పనిచేసింది. సాయితో మంచి పరిచయం ఉంది. సాయి ధరమ్ గురించి చెప్పాలంటే చిరంజీవిగారి పోలికలు, కళ్యాణ్ గారిలోని గట్స్, మంచితనం సాయిలో ఉంటాయి. యూనిట్ అంతటికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
నరేష్ మాట్లాడుతూ ‘’హరీష్ శంకర్ గారిని కథ గురించి చెప్పమని అడిగితే ఇది హీరోకి ఒక డెమో ఫిలిం అని సింపుల్ గా సింగిల్ లైన్ చెప్పేశారు. సాయిని నా బిడ్డ అంటుంటాను. నా కొడుకు నవీన్, సాయి మంచి స్నేహితులు. ఇప్పటికీ అదే హంబుల్ నెస్ ఉన్న హీరో. హరీష్ స్క్రిప్ట్, ఎగ్జ్ క్యూషన్ సూపర్. ప్రతి షాట్ ను ఎమోషన్స్ తో సింగిల్ లైన్ లో చెప్పగల సమర్ధుడు. ఈ సినిమాలో  ఒక మంచి క్యారెక్టర్ చేశాను. చాలా ఎమోషన్స్ ఉన్న సినిమా. ఆ ఎమోషన్స్ అన్నీ క్లయిమాక్స్ లో చూశాను. ఫెంటాస్టిక్ క్లయిమాక్స్. సినిమా చూసిన వారు థ్రిల్ ఫీలవుతారు’’అన్నారు.
గోపిచంద్ మలినేని మాట్లాడుతూ ‘’సాయిధరమ్ తేజ్ ఒక ఎనర్జీ. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుండి ఒక క్లోన్ బయటకి వస్తే అదే సాయిధరమ్ తేజ్. బయట పోస్టర్ చూస్తుంటే చిరంజీవిగారి రౌడీ అల్లుడు, గ్యాంగ్ లీడర్, పవర్ స్టార్ బద్రి, జల్సా సినిమాలు గుర్తుకు వచ్చాయి. ఎక్స్ ట్రార్డినరీగా ఉన్న రైజింగ్ స్టార్. అందరినీ అన్న అని పిలుస్తాడు. తనతో ఎప్పుడెప్పుడు సినిమా చేద్దామా అని అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమ చేసిన హరీష్ గురించి చెప్పాలంటే తనొక మిరపకాయ్. ఎప్పుడూ ఎనర్జిటిక్ గా, ఫోకస్ డ్ గా, సినిమా గురించే ఆలోచిస్తుంటాడు. చాలా క్లారిటీ, గట్స్ ఉన్న డైరెక్టర్. హరీష్, సాయిధరమ్ తేజ్ లో ని ఎనర్జీయే సుబ్రమణ్యం ఫర్ సేల్. క్లాస్ మ్యూజిక్ ఇచ్చే మిక్కి జె.మేయర్ గారు హరీష్ వంటి మాస్ డైరెక్టర్ చేతిలో పడ్డారు. మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇకపై అందరూ మాస్ డైరెక్టర్స్ మిక్కి కావాలని ఆయన వెంబడి పడతారు. మ్యూజిక్ అలా ఉంది. దిల్ రాజుగారు ఎక్స్ ట్రార్డినరీ ప్రొడ్యూసర్. సినిమా అంటే ప్యాషన్ ఉన్న నిర్మాత. రాజుగారికి, శిరీష్, లక్ష్మణ్, హర్షిత్, రాంప్రసాద్ గారికి అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
సంతోష్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘’హరీష్ శంకర్ అంటే నాకు ఎనర్జీ. తన చేసిన మిరపకాయ్, గబ్బర్ సింగ్ సినిమాలు చాలా ఇష్టం. అలాంటి డైరెక్టర్ చేతికి సాయిధరమ్ వంటి హీరో కలవడం, సూపర్ కాంబినేషన్. దిల్ రాజుగారి ప్యాషన్ స్క్రీన్ పై కనపడుతుంది. ఈ సినిమాకి అసలైన ఎనర్జీ హరీష్ గారి డైలాగ్స్, ఆ పవర్ అంతా స్క్రీన్ పై కనపడుతుందని ఆశిస్తున్నాను’’ అన్నారు.
చంద్రబోస్ మాట్లాడుతూ ‘’తెలుగు గురించి ఈ సినిమాలో పాట రాశాను. ఈ పాటను రెండు రాష్ట్రాల్లోని ప్రజలకు అంకితం ఇస్తున్నాను. యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
డి.వి.వి.దానయ్య మాట్లాడుతూ ‘’సాంగ్స్ చూస్తుంటే ఆడియో, సినిమా సూపర్ డూపర్ హిట్టవుతుందనిపిస్తుంది. హరీష్ నాకు మంచి మత్రుడు. సినిమా ఇరగదీసి ఉంటాడని అనుకుంటున్నాను’’ అన్నారు.
బండ్ల గణేష్ మాట్లాడుతూ ‘’నా జీవితానికి అర్థం చెప్పిన దర్శకుడు హరీష్ శంకర్ అయితే నాతో పాటు హరీష్ శంకర్ జీవితానికి అర్థం చెప్పిన వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. మా జీవితాలకు ల్యాండ్ మార్క్ అయిన గబ్బర్ సింగ్ సినిమా చేయడం అదృష్టంగా ఫీలవుతున్నాను. ఇప్పుడు మెగోత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఆనందం తట్టుకోలేక జ్వరమొస్తుంది. చిరంజీవిగారు రంగంలోకి దిగుతున్నానని ఆయన గెటప్ తో అందరికీ సవాల్. మెగాస్టార్ చరిత్రకే చరిత్ర చెప్పిన వ్యక్తి ఆయనే. ఎవరెస్ట్ శిఖరాన్నెక్కిన ఆయన మొగల్లూరుని, తల్లిదండ్రులుని, ప్రజలని, ఫ్యాన్స్ ని మరచిపోలేదు. అదే వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. సాయిధరమ్ గురించి చెప్పాలంటే తను హీరో అవుతాడని ముందు తెలిసిన వ్యక్తిని నేనే అనుకుంటాను. సారి కళ్యాణ్ బాబు సాయిని చూపిస్తూ వీడు హీరో అవుతాడురా అని అన్నాడు. లావుగా ఉన్నాడుగా ఏం హీరో అవుతాడులే అనుకున్నాను. కానీ బయటకి చెప్పలేదు. చివరికి సినిమా స్టార్ట్ అయ్యే టైమ్ కి సాయిని చూస్తే ముందు నుండి చిరంజీవిగారి పోలికలు, పక్క నుండి పవన్ గారి పోలికలు, వెనుకనుండి నాగబాబుగారి పోలికలు కనపడ్డాయి. సినిమా చూడగానే కొట్టేశాడురా..అనుకున్నాను. ఈ సినిమాతో సాయి హిట్ కొట్టడం ఖాయం. దిల్ రాజు మరోసారి మేకర్ అంటే తెలిపే సినిమా అవుతుంది. యూనిట్ కి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.
కోటి మాట్లాడుతూ ‘’ గువ్వా గోరింక సాంగ్ రీమేక్ చేసి నాకు నిజంగా సర్ ప్రైజ్ చేశారు. ఎవరెన్ని స్టెప్స్ వేసినా మా మెగాస్టార్ చిరంజీవిగారి తర్వాతే. ఆయన కోసమే ఈ పాట పుట్టింది. తేజ్ చాలా బాగా చేశాడు. మావయ్యలందరూ తనలో మిక్స్ అయి ఉన్నారు. దిల్ రాజు, హరీష్ శంకర్ గారికి ఆల్ ది బెస్ట్’’ అన్నారు.

సాయిధరమ్‌తేజ్‌రెజినాఅదాశర్సుమన్‌కోట శ్రీనివాసరావునాగబాబురావురమేష్‌పృథ్విప్రభాస్‌ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జె.మేయర్‌సినిమాటోగ్రఫీ: సి.రాంప్రసాద్‌ఎడిటింగ్‌: గౌతంరాజుఫైట్స్‌: రామ్‌లక్ష్మణ్‌,వెంకట్‌ఆర్ట్‌: రామకృష్ణస్క్రీన్‌ప్లే: రమేష్‌రెడ్డిసతీష్‌ వేగేశ్నతోట ప్రసాద్‌కో`ప్రొడ్యూసర్స్‌: శిరీష్‌లక్ష్మణ్‌నిర్మాత: దిల్‌రాజుకథ-మాటలు-దర్శకత్వం: హరీష్‌ శంకర్‌ ఎస్‌. 
« PREV
NEXT »

No comments

Post a Comment