తాజా వార్తలు

Saturday, 22 August 2015

తన ప్రేమను పంచలేక

అక్కున చేర్చుకునే అమ్మలేకపోయినా..
ఆదరించే ఆత్మీయులుంటారని నమ్మింది
నిలబడి ధైర్యం చెప్పే నాన్న లేకపోయినా
నా అంటూ అన్పించే నేస్తాలుంటారనుకొంది
విశ్వవిద్యాలయంన విద్యావిలువలు పెరుగుతాయనుకొంది కానీ,
తన విలువలు చెరిపేసి విగతజీవిగా మారుస్తాయనుకోలేదు
మార్గదర్శకంగా నిలవాల్సిన ముందు తరగతివారు
మానవత్వం మరచి మదిని గాయపరిచారు
ప్రేరణగా నిలవాల్సిన పై తరగతి విద్యార్థులు
ప్రేమలోకి దింపాలని, ప్రాణం తీసుకొనేలా చేశారు
భవిష్యత్తుకై తాను వేసుకున్న బాటలన్నీ ముళ్లకంప చేరగా
భవితకై తాను కట్టుకున్న గోడ పునాదులే కదలగా
కన్నతల్లి జీవితాన కడుపుకోత మిగులుస్తూ..
కన్నతండ్రి కలలమీద నీళ్లుజల్లి ఆర్పేస్తూ
దాగివున్న మానవత్వాన్ని దారిలోకి రమ్మంటూ
కనుమరుగైన మంచితనాన్ని తన లేఖలో ప్రశ్నిస్తూ..
బాటలతో తన ఆశలన్నీ అనంతలోకం చేరగా
కట్టిన ఆ గోడలన్నీ కుప్పకూలి పోగా..
ఆరిపోయెన దీపం…
తన ప్రేమను పంచలేక
తన మనసును చంపుకోలేక
తన బాధను దిగమింగలేక
తన వెలుగును చిమ్మలేక
ఆరిపోయెనా దీపం
సరస్వతీ ఒడిలో..స్వర్గం చేరిపోయేను ఆ స్వప్నం

             ————–లక్ష్మీ ప్రియాంక పులవర్తి

« PREV
NEXT »

No comments

Post a Comment