తాజా వార్తలు

Sunday, 30 August 2015

ఆ కుట్ర కు చిరంజీవికి సంబంధం లేదట

80వ దశకంలో చిరంజీవి కి పోటీగా నెంబర్ వన్ రేసులో ఉన్న హీరో సుమన్ . పలు యాక్షన్ చిత్రాలతో అగ్ర హీరోగా చిరంజీవి కంటే అత్యంత వేగంగా తెలుగు తెరపైకి దూసుకువచ్చిన హీరో సుమన్ ,పైగా సుమన్ అందగాడు కూడా కావడంతో  ఆ రోజుల్లో సుమన్ అంటే అమ్మాయిలు పడి చచ్చేవాళ్ళు . అంత వేగంగా వెళుతున్న సుమన్ కెరీర్ ఒక్కసారిగా కుదుపులకు లోనయ్యింది. సుమన్ పై పలు ఆరోపణలు మోపుతూ జైలుకు పంపారు దాంతో సుమన్ కెరీర్ నాశనం అయిపొయింది . ఇదంతా కొంతమంది కావాలనే కుట్ర చేసారట ఆ కుట్ర కు చిరంజీవి కి సంబంధం ఉంది అని ఆరోపణలు కూడా వచ్చాయి కానీ ఆ ఆరోపణలను ఖండిస్తున్నాడు హీరో సుమన్ . ఈనెల 28న సుమన్ పుట్టినరోజు కావడంతో ఓ చానల్ ఇంటర్వ్యూ లో చిరు పై ఆరోపణలు చేయడంతో సుమన్ ఆగ్రహంగా ఆ ఆరోపణలు ఖండించాడు . చిరంజీవి నాపై కుట్ర చేయలేదని ,ఆ అవసరం అతడికి లేదని చెప్పాడు . 
« PREV
NEXT »

No comments

Post a Comment