తాజా వార్తలు

Sunday, 30 August 2015

బాలయ్యతో దోస్తీ చిరంజీవితో కుస్తీ అంటున్న విజయశాంతి...!మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా పార్క్ హయత్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరు కాని వారి జాబితాలో ఎంతో మంది ఉన్నారు. చిరంజీవి 60 యేళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన కెరీర్ ఆరంబం నుంచి అండగా నిలిచిన వారు.. ఆయనతో ఎన్నో సినిమాలు రూపొందించిన వారు.. ఎంతోమంది ఈ కార్యక్రమానికి హాజరు అయ్యారు.. కొందరు తప్ప! అలా ఈ కార్యక్రమానికి మిస్ అయిన వాళ్ల జాబితాను తయారు చేస్తే... చిరంజీవితో ఎక్కువ కాలం పాటు పనిచేసిన విజయశాంతి పేరును ప్రస్తావించుకోవాలి. మెగాస్టార్‌తో అత్యధిక సినిమాలు చేసిన హీరోయిన్లలో, ఎక్కువ హిట్స్‌లో భాగస్వామి అయిన వాళ్లలో విజయశాంతి ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. ఇప్పుడే కాదు.. చాలా కాలం నుంచే ఆమె మెగాస్టార్‌తో ఆఫ్ ది స్క్రీన్‌లో సన్నిహితంగా గడిపింది లేదు. స్నేహ పూర్వక సంబంధాలు లేవు. అయితే విశేషం ఏమిటంటే.. నందమూరి నటసింహం బాలయ్యతో మాత్రం విజయశాంతికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఆన్ స్క్రీన్ రొమాన్స్‌లో దుమ్ము రేపిన వీళ్లిద్దరూ ఆఫ్ ది స్క్రీన్‌లో ఇప్పటికీ టచ్‌లో ఉన్నారనే వీళ్లను బాగా ఎరిగిన వారు చెబుతారు.  ఇప్పటికీ బాలయ్య తన పక్కన నటించిన హీరోయిన్లలో బాగా ఇష్టమైన వాళ్లు ఎవరు అంటే.. విజయశాంతి పేరును తప్పక ప్రస్తావిస్తాడు. అదే చిరంజీవిని అడిగితే విజయశాంతి పేరు ఎత్తను కూడా ఎత్తడు! దీనికంతటికీ కారణం అప్పుడెప్పుడో ‘‘గ్యాంగ్ లీడర్’’ సినిమా సమయంలో జరిగిన గొడవలే అని సినిమా వాళ్లు చెబుతూ ఉంటారు. ఆ సినిమా సమయంలో ఇగో ప్రాబ్లమ్స్‌తో చిరంజీవి, విజయశాంతి మధ్య విభేదాలు పెరిగాయని అంటారు. ఆ తర్వాత వాళ్లిద్దరూ ఒకే ఒక సినిమాలో కలిసి నటించారు. ఇప్పటికీ స్నేహ పూర్వక సంభాషనలు, సంబందాలు లేవు. దశాబ్దాలు గడిచిపోయినా.. వయసు మీదప డుతున్నా కలిసి పనిచేసిన వీళ్ల మధ్య దూరం తగ్గకపోవడం విశేషమే!
« PREV
NEXT »

No comments

Post a Comment