తాజా వార్తలు

Saturday, 22 August 2015

విజృంభిస్తున్న విష జ్వరాలు


 తెలంగాణ రాష్ట్రంలో డెంగ్యూ, మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. సర్కారీ దవాఖానాల్లో సౌకర్యాలు లేకపోవడంతో..ప్రైవేట్‌ వైద్యం చేయించుకునే స్థోమత లేక గిరిజనులు అల్లాడిపోతున్నారు. రాష్ట్రంలో మృత్యు ఘంటికలు మ్రోగుతున్నా అధికారులు పట్టించుకోకపోవంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రాచలం, వెంకటాపురం, దుమ్ముగూడెం, చర్ల, వాజేడు మండలాల్లో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. ప్రతి ఇంటిలో ఒక్కరైనా రోగాల బారిన పడి మంచమెక్కుతున్నారు. వైద్యం కోసం ప్రభుత్వాస్పత్రులకు వెళ్లిన రోగులకు..సరైన వైద్యం అందక తీవ్ర అవస్థలు పడుతున్నారు. సర్కారీ ఆసుపత్రుల్లో సదుపాయాలు లేకపోవడంతో…అప్పు చేసి ప్రైవేట్‌ ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. నెలరోజుల్లో విషజ్వరాలతో 8 మంది మృత్యువాత పడ్డారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
« PREV
NEXT »

No comments

Post a Comment