Writen by
vaartha visheshalu
04:31
-
0
Comments
ఉదయం లేవగానే..మంచినీరు తాగడం వల్ల అసాధారణమైన ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఎన్నో అనారోగ్య సమస్యలకు నివారణిగా పనిచేస్తుందని వైద్యశాస్త్రం ధ్రువీకరించింది. నిద్రలేవగానే ఒకటిన్నర లీటర్ మంచినీళ్లు తాగాలి. తర్వాత గంట వరకు ఎలాంటి ఆహారం తీసుకోకూడదని నిపుణులు తెలుపుతున్నారు. పరగడుపున ఖాళీ కడుపుతో మంచినీళ్లు తాగడం వల్ల పెద్ద పేగు శుభ్రపడి మరిన్ని పోషకాలను గ్రహిస్తుంది. కొత్తరక్తం తయారీని, కండర కణాల వృద్ధి పెంచుతుంది. పొద్దునే కనీసం అరలీటరు నీటిని తాగడం వల్ల 24 శాతం శరీర మెటబాలిజాన్ని పెంచుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రక్తకణాలు శుద్ధి చేయడం వల్ల శరీరంలోని మలినాలు తొలగుతాయి. దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది. శ్వేత ధాతువులను సమతుల్యం చేస్తుంది.
No comments
Post a Comment