తాజా వార్తలు

Friday, 28 August 2015

కాంగ్రెస్ నేతలపై డీ ఎస్ ఫైర్

రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సలహాదారుగా డి. శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. మరోవైపు తనపై విమర్శలు చేస్తున్న కాంగ్రెస్ నేతలపై ఆయన మండిపడ్డారు. 45 ఏళ్లు కాంగ్రెస్‌ లో ఉన్నానని, తనను విమర్శించినా ఆవేదనతో భరించానని, తాను నోరు తెరిస్తే కాంగ్రెస్‌ నేతలు ఇబ్బంది పడతారని డీఎస్ అన్నారు. రెండుసార్లు కాంగ్రెస్‌ ను అధికారంలోకి తీసుకొచ్చానని చెప్పారు. తన టాలెంట్‌ ను వృథా చేసుకోలేనన్న డీఎస్.. తన టాలెంట్‌ ను కేసీఆర్ గుర్తించారన్నారు. సీఎం కేసీఆర్ ముందుచూపున్న నాయకుడని డీఎస్ మెచ్చుకున్నారు. అంతరాష్ట్ర సంబంధాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పగించిన బాధ్యతలను చిత్తశుద్ధితో నెరవేరుస్తానని డి.శ్రీనివాస్ అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణకు, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్ గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో కొన్ని వివాదాలున్నాయన్నారు. ఈ సమస్యలను సామరస్య పూరిత వాతావరణంలో పరిష్కరించేందుకు తాను కృషి చేస్తానని చెప్పారు.   అటు చంద్రబాబు తీరేంటో తనకు అర్థం కావడం లేదని డీఎస్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సాగునీరు, హైకోర్టు విభజన, ఆస్తులు, ఉద్యోగుల విభజన వంటి అంశాల్లో వివాదాలున్నాయని డీఎస్ వివరించారు.  

« PREV
NEXT »

No comments

Post a Comment