తాజా వార్తలు

Saturday, 29 August 2015

పాకిస్తాన్ జెండాను తగలబెట్టిన పాక్ మాజీ సైనికుడు

పాకిస్తాన్ మాజీ సైనికుడు ఒకరు.. తమ దేశ జెండాకు నిప్పు పెట్టాడు, అంతేకాకుండా దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీధుల్లో హల్ చల్ చేసిండు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తున్నరు. వివరాల్లోకి వెళితే.. కామరుల్ జమాన్ పాకిస్థాన్ సైన్యంలో పని చేసేవాడు. కొన్ని కారణాలతో అతను ఇంటికి వెళ్లిపోయాడు. తరువాత సైన్యంలోకి వెళ్లకుండా చాలా కాలం సెలవులు తీసుకున్నాడు. కామరుల్ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో సైన్యం అతనిని ఆర్మీ నుండి తొలగించింది. అనంతరం అతను ఓ ప్రయివేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. అప్పటి నుండి అవకాశం చిక్కిన ప్రతిచోటా పాక్ ను విమర్శిస్తున్నాడు. చివరికి ఈ నెల 13వ తేదిన పాక్ జాతీయ జెండాను తగలబెట్టాడు. అనంతరం మరోసారి 28న కూడా పాకిస్థాన్ జాతీయ జెండాను పూర్తిగా తగలబెట్టాడు. పాక్ వ్యతిరేకంగా నినాదాలు చేశాడు. జమాన్ పాక్ జాతీయ జెండాను ఎందుకు తగలబెట్టిండో..విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. 
« PREV
NEXT »

No comments

Post a Comment