తాజా వార్తలు

Saturday, 22 August 2015

గుంటూర్ లో ప్రత్యేకహోదా ఫ్లెక్సీల కలకలం


ఏపీకి ప్రత్యేక హోదా తెచ్చేది ఎవరు? ప్రత్యేక హోదాపై ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడితే డొక్క చీలుస్తాం. టాప్ లేచిపోద్ది, రంగు పడుద్ది’’ తదితర వ్యాఖ్యలతో ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ పేరుతో ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి.  ఏపీకి ప్రత్యేక హోదాపై నవ్యాంధ్రలోని ప్రధాన నగరమైన గుంటూరులో ఈ వివాదాస్పద ఫ్లెక్సీలు వెలిశాయి. నగరంలోని శంకర్ విలాస్ సెంటర్, అరండల్ పేట ఫ్లై ఓవర్ బ్రిడ్జిల వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. ఇవి వీటిపై పలు ప్రజా సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఎవరు ఈ ఫ్లెక్సీలు పెట్టారనే విషయంపై అధికారులు ఆరాతీస్తున్నారు. 
« PREV
NEXT »

No comments

Post a Comment