తాజా వార్తలు

Sunday, 30 August 2015

పటేళ్ లకు రిజర్వేషన్ వచ్చే వరకు పోరాటం ఆపను- హార్దిక్ పటేల్

గుజరాత్‌లో పటేళ్ కమ్యూనిటీ వర్గం పటేళ్ల ఉద్యమ నాయకుడు హార్దిక్ పటేల్ ఢిల్లీకి చేరుకున్నారు. కొన్ని బీసీ వర్గాల నేతలతో హార్దిక్ పటేల్  సమావేశం కానున్నరు. రిజర్వేషన్లు సాధించే వరకు తమ పోరాటం ఆగదన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద, యూపీలోని లక్నోలో ర్యాలీలు నిర్వహిస్తామని వెల్లడించారు. హార్దిక్ సహాయకుడు ఒకరు మాట్లాడుతూ.. తమ రిజర్వేషన్ల డిమాండ్‌పై ఇతర కులాల నేతలతో చర్చలు జరుపుతున్నామని, భవిష్యత్‌లో తమ ఉద్యమం ఎలా దూసుకు పోతుందో చూడాలని అన్నారు. అయితే తాను ఉద్యమ భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన కోసం మాత్రమే ఢిల్లీ వచ్చానని వెల్లడించారు. ఏ కేంద్ర మంత్రిని కలిసే ప్రసక్తేలేదని తేల్చి చెప్పారు. పటేళ్ల రిజర్వేన్ల సమస్యను దేశవ్యాప్తంగా తీసుకుపోయి చర్చిస్తామన్నారు. అందరి సహకారం తీసుకుంటామన్నారు. పటేళ్ల సమస్యను సమాజంలోని అందరికీ వివరిస్తామన్నారు.
« PREV
NEXT »

1 comment

  1. నీవింత గట్టివాడవనుకోలేదోయ్;

    ReplyDelete