తాజా వార్తలు

Monday, 31 August 2015

జగన్ కు మాట్లాడే అర్హత లేదంటున్న.... చంద్రబాబు.?
 నోరున్నోడిదే రాజ్యం అన్నట్టు ఇప్పుడు అధికారం ఉన్నోడిదే మైక్ అనే నినాదంతో మన ఆంద్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి . వివరాల్లోకెలితే
  మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతికి సంతాప సూచకంగా మౌనం  పాటించిన అనంతరం.. ఏపీకి ప్రత్యేకహోదా రాదనే ఆందోళనతో ఆత్మహత్య చేసుకొన్న వారికి సంతాపం ప్రకటిద్దామని స్పీకర్ ప్రతిపాదించారు. సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడుతూ ప్రసంగించాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "ఏపీకి ప్రత్యేక హోదా ఆలస్యం అవుతోందనే ఆందోళనతో ఆత్మహత్య చేసుకొన్న వారికి సంతాప సూచకంగా మౌనం పాటిద్దాం..'' అని అన్నారు. బాబు రెండు నిమిషాల ప్రసంగం అనంతరం మైక్ జగన్ కు వెళ్లింది. ప్రతిపక్ష నేతగా జగన్ స్పందించాలని స్పీకర్ కోరారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... "ప్రత్యేక హోదా ఆలస్యం అవుతోందని కాదు.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర మంత్రుల ప్రకటనలు వినే ఆత్మహత్యలు నమోదవుతున్నాయి...'' అని అన్నాడు.  అంతే... సీన్ మారిపోయింది. జగన్ కు మైక్ కట్ అయ్యింది. చంద్రబాబు నాయుడు లేచారు. ఉగ్రరూపుడయ్యాడు. హై పిచ్ లో రెచ్చిపోయాడు. తీవ్రస్థాయిలో విరుచుకు పడటంతో బాబు గొంతే మారిపోయింది. ఒక దశలో ఆగి మంచినీళ్లు తాగాల్సి వచ్చింది. అంతా రెచ్చిపోయారు ముఖ్యమంత్రి. "నోరుందని అడ్డంగా మాట్లాడొద్దు..''అంటూ మొదలు పెట్టిన చంద్రబాబు "జైలు కెళ్లారు.. అవినీతి పరులు.. దోచుకొన్నారు... '' అంటూ మాట్లాడారు. జగన్ కు మాట్లాడే అర్హత లేదు అని తేల్చేశాడు. "హైదరాబాద్ ను నేనే అబివృద్ధి చేశా.. ప్రపంచపటంలో నేనే పెట్టించా...''అంటూ బాబు వ్యాఖ్యానించారు! అక్కడ నుంచి బాబు ఒక పదిహేను నిమిషాల పాటు ఏకధాటి ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో బాబు తన గొప్పలు తాను చెప్పుకొంటూ.. వైకాపా వాళ్లు జైలు పక్షులు అంటూ వ్యాఖ్యానించారు. మరి సంతాప తీర్మానం ఈ విధంగా మలుపు తిరిగింది. తన కసి తీరా మాట్లాడిన తర్వాత బాబు కూర్చొన్నారు. ఇక వైకాపాకు మాట్లడానికి ఏమీ లేకుండా పోయింది! ఈ సీన్ ను చూస్తే... జగన్ మాట్లాడింది కచ్చితంగా ఒక నిమిషం అయితే బాబు దాదాపు ఇరవైన నిమిషాలు సంబంధం లేని ప్రసంగం చేశారు. ఆయన కసితీరా మాట్లాడారు. గొంతులో తడారిపోయేలా జగన్ పై దుమ్మెత్తిపోశారు. ఇదీ శాసనసభలో సంతాప తీర్మానం తీరు!  
« PREV
NEXT »

No comments

Post a Comment