తాజా వార్తలు

Saturday, 29 August 2015

ప్ర‌త్యేక హోదా కు చంద్ర‌బాబు అనుకూల‌మా..వ్య‌తిరేక‌మా..?-జగన్

ప్ర‌త్యేక హోదా కోసం చేసిన బంద్ విజయవంతం చేసి ప్రజలు తమ ఆకాంక్షను చాటిచెప్పారిని వైఎస్ జగన్ స్పష్టంచేశారు. బంద్  ద్వారా ప్ర‌జ‌లు రాష్ట్రానికి బంధ‌నం క‌ట్టార‌ని వైఎస్ జ‌గ‌న్ అభిప్రాయ ప‌డ్డారు.  ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. ప్రత్యేక హోదా వస్తే 90శాతం గ్రాంటు, 10శాతం రుణం వస్తుందని, అయితే.. ప్రత్యేక ప్యాకేజీనే మేలని ప్రజలను టీడీపీ నేతలు మభ్యపెడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. ప్రత్యేక హోదాతో ప్రతి జిల్లాను హైదరాబాద్‌లా తయారు చేయవచ్చని, ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో చంద్రబాబును నిలదీస్తామన్నారు. ఎన్నికలకు ముందు ఐదేళ్లు కాదు.. పదేళ్లపాటు ప్రత్యేక హోదా కావాలన్న నేతలు ఇప్పుడెందుకు మాట్లాడటం లేదని, అసలు 14 వ ఆర్థిక సంఘానికి ప్రత్యేక హోదాతో సంబంధం లేదని, ప్రత్యేక హోదా దాని పరిధిలోకి రాదని, ప్రత్యేక హోదా అంశం ప్రధాని చేతుల్లోనే ఉందన్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ అనుసరిస్తున్న విధానానికి నిరసనగా తెలుగుదేశం పార్టీ తన మద్దతును విరమించుకోవాలన్నారు. శనివారం జరిగిన బంద్‌ను విఫలం చేసేందుకే కేబినెట్‌ భేటీ పెట్టారని, అయినా... బంద్‌కు అన్ని వర్గాల ప్రజలు సహకరించారని వీరికి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. 
జగన్ మాటల్లో..
*బంద్ కు స‌హ‌క‌రించిన వారంద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు
*40 మంది ఎమ్మెల్యేల‌ను అరెస్ట్ చేయించారు
*ప్ర‌త్యేక హోదా కు చంద్ర‌బాబు అనుకూల‌మా..! వ్య‌తిరేక‌మా..!
*ఇప్ప‌టికైనా చంద్ర‌బాబు తీరు మారాలి
*ఎన్ని కుట్ర‌లు పన్నినా బంద్ విజ‌య‌వంతం
*హోదా వ‌స్తే ప్ర‌తీ జిల్లా ఒక హైద‌రాబాద్ అవుతుంది
* ప్ర‌త్యేక హోదా మీద రోజూ అబ‌ద్దాలు, నాట‌కాలు ఆడుతున్నారు
* పార్ల‌మెంటులో ప్ర‌ధాని ప్ర‌క‌ట‌న‌కే విశ్వ‌స‌నీయ‌త లేదా..!
* చంద్ర‌బాబు చ‌రిత్ర హీనుడుగా మిగులుతాడు
* ప్ర‌త్యేక హోదా కోసం పోరాటం ఆగ‌దు, అసెంబ్లీ వేదిక‌గా నిల‌దీస్తాం..!
« PREV
NEXT »

No comments

Post a Comment