తాజా వార్తలు

Sunday, 30 August 2015

అభివృద్ధితో అన్ని సమస్యలకు పరిష్కారం-ప్రధాని మోడీ

ప్రధాని నరేంద్ర మోడీ 'మన్ కి బాత్' కార్యక్రమం ఆల్ ఇండియా రేడియోలో ప్రసంగించారు. భూ సేకరణ చట్టానికి సవరణ అవసరమని, అన్ని సమస్యలకు అభివృద్ధితోనే పరిష్కారమన్నారు ప్రధాని నరేంద్రమోడీ. గ్రామీణ ప్రాంతాల్లో కాలువలు, రహదారుల నిర్మాణం, గ్రామాల విద్యుదీకరణ జరుగాలంటే భూ సేకరణ చట్టానికి సవరణ చేయక తప్పదన్నారు. భూ సేకరణ చట్ట సవరణపై కొందరు అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. అటు జన్ ధన్ యోజన పథకాన్ని ప్రజలు విజయవంతం చేశారని ప్రధాని చెప్పారు. జన్ ధన్ యోజన పథకం కింద 18 కోట్ల మంది ఖాతాలు తెరిచారని, 22 వేల కోట్ల రూపాయల నగదు జమైందని తెలిపారు.  భూ సేకరణకు చట్ట సవరణ అవసరమని మోడీ తెలిపారు. లండన్ లో డాక్టర్ అంబేద్కర్ ఇల్లును కొనుగోలు చేయనున్న మహారాష్ట్ర ప్రభుత్వానికి మోడీ అభినందనలు తెలిపారు. సైకిల్ రేసింగ్ లోఅమెరికాలో పర్యటింటిన ఇద్దురు వైద్యులకు మోడీ అభినందనలు తెలిపారు. నాసిక్ నుండి ఈ ఇద్దరు వైద్యులు, మహేంద్ర హిటెంద్ర మహాజన్ సైకిల్ రేస్ తో అమెరికా  అంతటా తిరిగారు.

« PREV
NEXT »

No comments

Post a Comment