తాజా వార్తలు

Sunday, 30 August 2015

ఉండవల్లికి మకాం మార్చిన సీఎం చంద్రబాబు

చంద్రబాబు ఏపి నూతన రాజధానికి మకాం మార్చారు.ఉండవల్లికి సమీపంలో చంద్రబాబు దంపతులు గృహ ప్రవేశం కూడా చేసేశారు. బెజవాడలో క్యాంప్‌ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. బాబు గారి కొత్త ఇల్లు కృష్ణా నది తీరంలో ఉంది. తమ బంధుమిత్రులతో శనివారం చంద్రబాబు, భువనేశ్వరీ కలిసి అతిథిగృహంలో శాస్త్రోక్తంగా పాలు పొంగించి పూజా కార్యక్రమాలు చేశారు. ఇకపై వారంలో మూడు, నాలుగు రోజులపాటు ఇక్కడి నుంచే పాలన కొనసాగించనున్న చంద్రబాబు ఇదే నివాసంలో ఉండనున్నారు.సీఎం చంద్రబాబు.. రాజధాని ప్రాంతానికి వెళ్లినప్పుడల్లా ఆయన సిబ్బంది, అధికారులకు అవసరమైన బిల్డింగులను ఇప్పటికే సిద్ధం చేశారు. కరకట్టకు సమీపంలో నూతనంగా నిర్మించిన కేఎస్సార్ ఎన్‌క్లేవ్‌లో దాదాపు 10ప్లాట్లు తీసుకున్నట్లు సమాచారం.  
« PREV
NEXT »

No comments

Post a Comment