తాజా వార్తలు

Saturday, 29 August 2015

'పనిలేని పులిరాజు' ఫస్ట్ లుక్


ధన రాజ్ హీరోగా పాలెపు మీడియా ప్రై.లి బ్యానర్ పై  పి.వి.నాగేష్ కుమార్ నిర్మిస్తున్న చిత్రం 'పనిలేని పులిరాజు'. ఈ సినిమాలో ఐదుగురు ముద్దుగుమ్మలు నటిస్తున్నరు. ఈ చిత్రానికి చాచా దర్శకుడు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న చిత్రం సెప్టెంబర్ మొదటి వారం లో ఆడియో రిలీజ్ చేసుకొని అక్టోబర్ లో విడుదల కానుంది. ఇటివలే ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ ను సోషల్ మీడియాలో విడుదల చేసారు చిత్ర యూనిట్.  ఈ సందర్భంగా నిర్మాత సహా నిర్మాత రవి కె.పున్నం మాట్లాడుతూ "ధన్ రాజ్ మొట్ట మొదటి సారిగా సోలో హీరో గా నటించిన చిత్రమిది. డైలాగ్ కామెడి తో కూడిన ఈ చిత్రం  ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది." అన్నారు. ఈ సందర్భంగా నిర్మాత నగేష్ కుమార్  మాట్లాడుతూ" సినిమా మేం అనుకున్న దానికన్నా చాలా రెట్లు బాగా వచ్చింది. రాజేంద్ర ప్రసాద్ 'లేడీస్ టైలర్' చిత్రాన్ని తలపించే విధంగా ఈ సినిమా రూపొందించాం. ప్రతి సీన్ పంచ్ లతో నిండి ఉంటుంది. ఖచ్చితంగా సినిమా ప్రేక్షకులను బాగా అలరిస్తుందని మా గట్టి నమ్మకం" అన్నారు. చిత్ర దర్శకుడు చాచా మాట్లాడుతూ" కామెడీ తో కూడిన రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. ప్రతి సీన్ అందరిని ఆకట్టుకునేలా ఉంటుంది. ఈ చిత్రం అనుకున్న దానికంటే బాగా రావాడానికి కారణమైనా మా టీం అందరికి నా ధన్యవాదాలు" చెప్పారు.
« PREV
NEXT »

No comments

Post a Comment