తాజా వార్తలు

Sunday, 23 August 2015

భూమిపై పోరాడటంలో తప్పేముంది- పవన్ కళ్యాణ్

గుంటూరు జిల్లా పెనుమాకలో రైతులతో సమావేశమైన అనంతరం పవన్ ప్రసంగించారు. ఆనంద పెట్టే రాజధాని కావాలి గానీ, కన్నీళ్లు తెప్పించే రాజధాని వద్దు. భూసేకరణ చేయడానికి వీల్లేదు. రైతులు ఇష్టంగా ఇస్తేనే భూములు తీసుకోండి. బలవంతంగా లాక్కోవద్దు. ఇది సరికాదు. ప్రత్యేక పరిస్థితుల్లోనే టీడీపీ, బీజేపీకి మద్దతిచ్చా. వైసీపీ తనకు శత్రువు కాదు. నాకు వ్యక్తిగతంగా శత్రువులు ఎవరూ లేరు. సమస్యను పరిష్కరించేందుకు చావుకు కూడా వెనుకాడను. భూమిపై ఆధారపడి జీవితాన్ని గడుపుతున్న రైతులు దాని కోసం పోరాడటంలో తప్పేముందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. రైతుకు అన్నం పెడుతున్న భూమి విషయంలో మంత్రి కిషోర్ బాబు ఆఫ్ట్రాల్ అనే పదాన్ని ఉపయోగించడాన్ని పవన్ తప్పుబట్టారు. అన్నదాత కన్నీళ్ళతో రాజధాని కట్టడం మంచిది కాదంటూ తండ్రి తర్వాత తండ్రి అంతటి అన్నయ్యను వదిలేసి వచ్చానన్నారు. రైతు కన్నీరు పెట్టని గ్రామీణ భారతాన్ని చూడాలన్నది తన కోరిక అన్నారు. రాజధాని కోసం భూసేకరణను వ్యతిరేకిస్తున్న రైతులను ఉద్దేశించి జనసేన అధినేత, సినీ హీరో పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తూ కీలక ప్రశ్నలు వేశారు. ఉమ్మడి ఏపీలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణంలో తన భూమి పోతోందంటూ ఎంపీ మురళీ మోహన్ కోర్టుకెళ్ళిన సంగతిని పవన్ గుర్తు చేశారు.  
« PREV
NEXT »

No comments

Post a Comment