తాజా వార్తలు

Sunday, 30 August 2015

పూనం పాండే రూటే సపరేటు!!!
ప్రచారం కోసమే నగ్న చిత్రాలు పోస్ట్ చేశాను..పూనం పాండే
షార్ట్ కట్ లో ఎదగాలనుకున్నాను. అందుకే తన నగ్న ఫోటోలను ఫేస్ బుక్ లో పెట్టి పాపులర్ అయ్యానంటుంది మాలినీ హీరోయిన్ పూనం పాండే. పూనం ఏం చేసినా సంచలనమే. ఆమె ఒక్కసారి కామెంట్ చేస్తే లక్షల సంఖ్యలో ఫాలో అవుతారు నెటిజన్లు. సోషల్ మీడియాలో ఫోటో పెడితే చాలు..కోట్లల్లో క్లిక్ లు వచ్చిన ఉదంతాలు ఉన్నాయి. 2011లో భారత్ ప్రపంచ కప్ గెలిస్తే నగ్నంగా కనపడతానని చెప్పి సంచలనం కలిగించిందీ అమ్మడు. ఆ తర్వాత భారత్ కప్ గెలిచినా..బీసీసీఐ ఒప్పుకోవడం లేదని తాను పడుతున్న నగ్న ఫోటోను పోస్టు చేసి యువతకు నిద్ర లేని రాత్రులను మిగిల్చింది. ఇంతకుఈ భామ కావాలనే ఈ పని చేశానంటుంది. పరిశ్రమలో ఎదగాలంటే గాడ్ ఫాదర్ ఉండాలి. తనకు ఎవరూ లేరు. అందుకే వివాదాలతో ఎదిగానని చెబుతుంది. 
అలాయని తనకు చాలా సెంటిమెంట్లు పాటిస్తానని..పద్దతైన పనులే చేస్తానని చెబుతుంది. రాత్రి 10 గంటల లోపే పడుకుంటానని కబుర్లు చెబుతుంది. లైట్ నైట్ పార్టీలకు దూరం దూరం అంటుంది. అంతే కాదు..ఇంట్లో టీ, టిఫెన్లు దగ్గర నుంచి భోజనం వరకు అన్నీ తానే వండుకుని తింటుందట. తన పనులను తాను చేసుకోవడం మంచిదనే ఆలోచనలో ఉందట. తన భావాలు ఆధునిక అమ్మాయిలా ఉంటాయని చెబుతూనే మరోవైపు సంప్రదాయ భావాలను విడనాడని చెబుతుంది. 
సన్నీలియాన్ తర్వాత అంత ఎక్కువగా నెటిజన్లు ఇప్పుడు పూనం పాండేను పాలో అవుతున్నారు. మరి ఈ కధానాయిక మరెన్ని వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుందో మరి. 
« PREV
NEXT »

No comments

Post a Comment