తాజా వార్తలు

Monday, 31 August 2015

305 నగరాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన

 ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి తొలిదశలో తెలంగాణ సహా 9రాష్ట్రాలు ఎంపికయ్యాయి. పట్టణాల్లో ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు ఉండాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ రాష్ర్టాల్లోని 305 నగరాలు, పట్టణాల్లో ఇండ్లు లేని నిరుపేదలకు పక్కా ఇండ్లు నిర్మించి ఇస్తారు. ఈ పథకం కింద కేంద్రం ఒక్కో ఇంటికి రూ.1లక్ష నుంచి రూ.2.30 లక్షల వరకు ఆర్థిక సాయం అందజేస్తుంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022వ సంవత్సరం నాటికి 75 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో అప్పటికల్లా దేశంలోని పట్టణ పేదలకు రెండు కోట్ల ఇండ్లను నిర్మించి ఇవ్వాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ నిర్ణయించింది. అందరికీ ఇండ్ల పథకాన్ని అమలుచేసేందుకు కేంద్రంతో 15 రాష్ర్టాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.తెలంగాణలో 34నగరాలు, పట్టణాల్లో మొదటిదశలో ఇండ్లు నిర్మించి ఇవ్వనున్నారు. కేంద్ర, రాష్ట్రాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేయనున్నాయి.   

« PREV
NEXT »

No comments

Post a Comment