తాజా వార్తలు

Friday, 28 August 2015

రాష్ట్రానికి భారీవర్ష సూచన


రాష్ట్రంలో చాలా చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు దాకా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనం అల్పపీడనంగా మారింది. ఉత్తర వాయవ్య, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా బంగాళాఖాతంలో దక్షిణ నైరుతి దిశగా 7.6 కిమీ ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే సూచన ఉన్నట్టు తెలిపింది. మరోవైపు, రాష్ర్టంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో భారీ వర్షం పడుతోంది. ఖమ్మం జిల్లా కొత్తగూడెం, బయ్యారం మండలాల్లో మోస్తరుగా, నల్లగొండ, చండూరులో భారీ వర్షం పడుతోంది. మహబూబ్‌ నగర్‌ లో భారీగా, నిజామాబాద్‌ జిల్లా అంకాపూర్‌ లో మోస్తరు వర్షం కురుస్తోంది.
« PREV
NEXT »

No comments

Post a Comment