తాజా వార్తలు

Friday, 28 August 2015

బాహుబలిపై రాజమౌళి సంచలన వ్యాఖ్యలు

బాహుబలి 50డేస్‌ కంప్లీట్ అయిన సందర్భంగా రాజమౌళి ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌లలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఇంతకముందులా 50,100,150 రోజులు సినిమాలు ఆడే అవకాశం ఇప్పుడు లేదు. ఈ రోజుల్లో మూవీస్‌ వేల థియేటర్స్‌లో రిలీజ్‌ అవుతున్నాయి. కాబట్టి మూవీ మూడు నాలుగు వారాలు ఆడితే హిట్‌ సినిమా కింద లెక్కే..ఆ సమయానికల్లా దాదాపుగా సినిమా లాంగ్‌రన్ అనేది పూర్తయిపోతుంది. కాని అభిమానులు కలెక్షన్లు లేకపోయినా ఎక్కువ రోజులు ఆడించమని అడుగుతుంటారు. ఒక్కొసారి వాళ్ల పాకెట్‌ మనీ తీసి మరి వాళ్ల అభిమాన హీరో సినిమాని ఎక్కువ రొజులు ఆడిస్తారు.ఇది తప్పు."అని అన్నారు రాజమౌళి. మరోవైపు "మిత్రులారా ఈ ఫేక్ రికార్డుల ద్వారా వచ్చే ఫాల్స్‌ రికార్డ్స్‌ వల్ల ప్రయోజనం లేదు.అభిమానుల ఇప్పటికే జీవితాంతం మర్చిపోలేని గిఫ్ట్‌ అందించారు.ఇంతకంటే మనకేంకావాలి. ఇప్పటికైనా ఇలాంటి చర్యను ఆపేయాలి. బాహుబలి కలెక్షన్లు రాబట్టే థియేటర్స్‌లో ప్రదర్శిస్తారు. కలెక్షన్లు లేకపోతే వచ్చే కొత్త సినిమాలను థియేటర్స్‌లో రిలీజ్ చేస్తారు. మేం ఫేక్‌ రికార్డ్‌లు కోసం థియేటర్స్‌ని బ్లాక్ చేయం" అంటూ  రాజమౌళి సంచలన వ్యాఖ్యలు చేశారు.
« PREV
NEXT »

No comments

Post a Comment